Begin typing your search above and press return to search.

ఏపీలో కొత్త మద్యం ధరలు ఇవే ..!

By:  Tupaki Desk   |   4 May 2020 6:00 AM GMT
ఏపీలో కొత్త మద్యం ధరలు ఇవే ..!
X
ఏపీలో లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా జగన్ ప్రభుత్వం మద్యం షాపులు తెరవాలని నిర్ణయించింది. అయితే , ఇదే సమయంలో మద్యం నియంత్రణ దిశగా జగన్ ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా మందుబాబులకు షాక్ ఇచ్చింది. మద్యం ధరలను 25 శాతం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. మద్యపానాన్ని నిరుత్సాహపరిచి, దుకాణాల దగ్గర రద్దీ తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పెంచిన ధరలతోనే నేటి నుండి మద్యం అమ్మకాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఏపీలో లిక్కర్ షాపులను ఉదయం 11 గంటలకు తెరుస్తారు. రాత్రి 7 గంటల వరకు తెరిచి ఉంటాయి. మద్యం విక్రయాలపై ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేశారు. అలాగే వైన్ షాపుల వద్ద సామాజిక దూరం తప్పకుండ పాటించాలని అని , అలాగే మాస్క్ తప్పనిసరి అని ప్రభుత్వం ఇప్పటికే తెలియజేసింది. పెంచిన మద్యం రేట్లను కూడా ఏపీ సర్కారు ప్రకటించింది. ఆ రేట్లు ఎలా ఉన్నాయంటే..

1. రూ 120 కన్నా తక్కువ ధర ఉన్న క్వార్టర్ బాటిళ్లపై రూ.20 పెంపు
2. హాఫ్ బాటిల్‌పై రూ.40 పెంపు
3. ఫుల్ బాటిల్‌పై రూ.80 పెంపు
4. రూ.120-150 ధర ఉన్న క్వార్టర్ బాటిళ్లపై రూ.40 పెంపు
5. హాఫ్ బాటిల్‌పై రూ.80 పెంపు
6. ఫుల్ బాటిల్‌పై రూ.120 పెంపు
7. రూ.150 కి పైగా ధర ఉన్న క్వార్టర్ బాటిళ్లపై రూ.60 పెంపు
8. హాఫ్ బాటిల్‌ పై రూ.120 పెంపు
9. ఫుల్ బాటిల్‌పై రూ.240 పెంపు
మినీ బీర్ పై రూ.20, ఫుల్ బీర్ రూ.30కి పెంపు..