Begin typing your search above and press return to search.

కరోనా నెగెటివ్ వ్యాపారం... ఆస్పత్రి లైసెన్స్ క్యాన్సిల్

By:  Tupaki Desk   |   7 July 2020 3:30 AM GMT
కరోనా నెగెటివ్ వ్యాపారం... ఆస్పత్రి లైసెన్స్ క్యాన్సిల్
X
రకరకాల కారణాల వల్ల కరోనా నెగెటివ్ సర్టిఫికెట్లకు డిమాండ్ పెరిగింది. దీంతో ఉత్తరప్రదేశ్ లోని ఓ ఆస్పత్రి దీనిని వ్యాపారంగా మార్చినట్లు, కేవలం 2500 రూపాయలకు కరోనా నెగెటివ్ సర్టిపికెట్లు అమ్ముతున్నట్టు ఓ వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో ఏముందంటే... మీరట్ (యూపీ) లోని న్యూ మీరట్ ఆస్పత్రిలో కరోనా టెస్టు చేయించుకుంటే పాజిటివ్ వచ్చినా, నెగెటివ్ వచ్చినా ... నెగెటివ్ సర్టిఫికెట్ ఇస్తారట. కేవలం 25 వందలు ఛార్జ్ చేస్తారట దీనికి.

ఈ విషయం వైరల్ కావడంతో ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. ఇదేం నిర్వాకం, ప్రభుత్వం ఏం చేస్తోంది? అని విమర్శలు వచ్చాయి. ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతారా అంటూ ప్రభుత్వం ఆ ఆస్పత్రి లైసెన్సునే రద్దు చేసింది. ఇకపై ఆస్పత్రి నడపడానికి వీల్లేదు అంటూ అల్టిమేటం జారీ చేసింది. అక్కడితో వదిలేయకుండా నిర్వహకులపై పలు సెక్షన్ల కింద తీవ్రమైన కేసులు పెట్టింది.

దీనిపై ఆస్పత్రి యజమాని స్పందించారు. ఆ వీడియోలో చెప్పింది నిజం కాదని... య‌జ‌మాని షా అలామ్ పేర్కొన్నారు. మేము అలాంటి తప్పుడు పని చేయలేదని, కొందరు గిట్టని వారు మాపై దుష్ప్రచారం చేశారని. మాపై కక్ష గట్టి మా పరువు మంటగలిపారని వాపోయారు. పోలీసు విచారణపై నమ్మకం ఉందని... మేము నిర్దోషిగా నిరూపితం అవుతామని అన్నారు.