Begin typing your search above and press return to search.
అమెరికాను బూడిద చేసే క్షిపణి ప్రయోగించిన కొరియా!
By: Tupaki Desk | 30 Nov 2017 4:03 AM GMTఅప్పుడే సద్దుమణిగిపోవడం...ఆ వెంటనే కలకలం చోటుచేసుకునే రీతిలో దౌత్యవివాదాలకు వేదికగా మారిన అమెరికా-ఉత్తరకొరియా వివాదాల పర్వంలో తాజా మరో కీలక పరిణామం చోటచేసుకుంది. అమెరికాను తరచుగా కెలుకుతున్న ఉత్తర కొరియా మళ్లీ బరి తెగించింది. ఇవాళ మళ్లీ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించింది. ఈ ఉదయం హాసంగ్-14 మిస్సైల్‌ను ఉత్తర కొరియా ప్రయోగించినట్లు తెలిసింది. ఇవాళ ప్రయోగించిన క్షిపణి అత్యంత బరువైన వార్ హెడ్ ను మోసుకెళ్లినట్లు నార్త్ కొరియా పేర్కొంది. ఇది గతంలో జరిగిన మిసైల్ పరీక్షల కంటే అత్యంత శక్తివంతమైనది నిపుణులు తేల్చారు. అత్యంత ఎత్తులో - ఎక్కువ దూరాన్ని ఈ క్షిపణి చేరుకున్నట్లు నిర్ధారణకు వచ్చారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల నార్త్ కొరియాకు వార్నింగ్ ఇచ్చినా.. ఆ దేశం మాత్రం తమ వైఖరిలో ఎటువంటి మార్పును ప్రదర్శించలేదు. దాదాపు రెండు నెలల విరామం తర్వాత మళ్లీ నార్త్ కొరియా మిస్సైల్ ను పరీక్షించింది. ఇవాళ జరిగిన మిస్సైల్ పరీక్ష ఓ రకంగా అమెరికాను హడలెత్తించింది. ఎందుకుంటే ఆ క్షిపణి వెళ్లిన తీరు నార్త్ కొరియా సత్తాను మరింత స్పష్టం చేసింది. జపాన్ జలాల్లో పడిన ఆ క్షిపణి అత్యంత శక్తివంతమైనదని స్వయంగా అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మాటిస్ వెల్లడించారు. ఖండాంతర క్షిపణి హాసంగ్-14 సుమారు 4500 కిలోమీటర్ల ఎత్తులో - దాదాపు 960 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు అంచనా వేస్తున్నారు.
దక్షిణ ప్యోంగ్యాంగ్ లోని ప్యోంగ్ సాంగ్ నుంచి ఇవాళ మిస్సైల్‌ను పరీక్షించారు. క్షిపణి సుమారు 53 నిమిషాల పాటు ప్రయాణించి ఉంటుందని జపాన్ అధికారులు అంచనా వేశారు. తమ దేశానికి ఉత్తర తీరం వైపున సుమారు 250 కిలోమీటర్ల దూరంలో క్షిపణి ల్యాండ్ అయినట్లు జపాన్ వెల్లడించింది. జపాన్, దక్షిణ కొరియా దేశాలు నార్త్ కొరియా ప్రయోగాన్ని ఖండించాయి. హాసంగ్-14 మిస్సైల్ కు స్టాండర్డ్ ట్రాజక్టరీలో కనీసం 13 వేల కిలోమీటర్లు ప్రయాణించే సత్తా ఉందని అమెరికా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆ మిస్సైల్ అమెరికాలో ఏ ప్రాంతాన్నైనా చేరుకుంటుందని అనుమానాలు వ్యక్తం చేశారు. కాకపోతే ఆ మిస్సైల్ అతి తక్కువ బరువు ఉండే వార్ హెడ్ ను మోసుకెళ్లినట్లు నిర్ధారణకు వచ్చారు. వేల కిలోమీటర్లు ప్రయాణించే మిస్సైల్.. అతిబరువైన అణ్వాయుధాలను మోసుకువెళ్లలేదని అంచనా వేస్తున్నారు.
నార్త్ కొరియా ఇవాళ ప్రయోగించిన మిస్సైల్ అత్యంత శక్తివంతమైనదని జేమ్స్ మాటిస్ తెలిపారు. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లే బాలిస్టిక్ క్షిపణులను ఉత్తర కొరియా తయారు చేస్తున్నది మాటిస్ హెచ్చరించారు. మిస్సైల్ ప్రయోగంలో ఉన్నప్పుడే ఆ అంశాన్ని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు చేరవేసినట్లు వైట్ హౌజ్ ప్రతినిధులు తెలిపారు. అయితే ఉత్తర కొరియా బెదిరింపుల పట్ల జాగ్రత్తలు తీసుకోనున్నట్లు ట్రంప్ వెల్లడించినట్లు సమాచారం. నార్త్ కొరియా గత సెప్టెంబర్ లో చివరిసారి బాలిస్టిక్ మిస్సైల్ ను పరీక్షించింది. అదే నెలలో ఆ దేశం ఆరవ అణు పరీక్షను కూడా నిర్వహించింది. అంతర్జాతీయంగా ఒత్తిళ్లు పెరుగుతున్నా.. నార్త్ కొరియా మాత్రం యదేచ్ఛగా అణు - మిస్సైల్ పరీక్షలతో అందర్నీ హడలెత్తిస్తున్నది. తాజా పరీక్షపై ఐక్యరాజ్యసమితి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఓ నిర్ణయం తీసుకోంది. కాగా, ఈ క్షిపణి పరీక్షతో మళ్లీ కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.