Begin typing your search above and press return to search.
కోత్త నోట్లు ఎలా దారి మళ్లుతున్నాయంటే..
By: Tupaki Desk | 12 Dec 2016 7:15 AM GMTపెద్ద నోట్లను రద్దు చేసి నెల రోజులు దాటిపోయింది.. సామాన్యులకు రెండు వేల రూపాయలు దొరకడం కూడా కష్టంగా ఉంది. కానీ... బడాబాబుల ఇళ్ల బాత్రూంల్లో వందల కోట్ల కొత్త నోట్లు దొరుకుతున్నాయి. ఏటీఎంల వద్దే కాదు బ్యాంకుల వద్దా నో క్యాష్ బోర్డులు పెడుతున్నారు. ఎక్కడా రూపాయి దొరకడం లేదు... మరి వీళ్లకు ఇంత పెద్ద మొత్తంలో డబ్బెలా వస్తోందన్నది ఆశ్చర్యకరమే. బ్యాంకు అధికారుల సహకారం లేకుండా ఇంత పెద్ద మొత్తంలో కొత్త నోట్లు పొందడం సాధ్యం కాదు. కాబట్టి ఈ దందాల్లో మొత్తం బ్యాంకోళ్లు, ఏటీఎంలకు డబ్బు నింపే సంస్థలు ఉనట్లు విపిసిస్తోంది.
పెద్ద నోట్ల రద్దు తరువాత దాదాపు ప్రతి రోజూ భారీ మొత్తంలో కొత్త కరెన్సీ దొరుకుతోంది. శనివారం తమిళనాడులో 24 కోట్లు దొరికాయి... డిసెంబరు 9న ఢిల్లీ, ముంబయి, గుర్గావ్ లలో కోట్ల రూపాయలు పట్టుకున్నారు. 7, 8 తేదీల్లో మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, గోవాల్లో భారీగా డబ్బు దొరికింది. ఇలా ఏపీ, మహారాష్ర్ట, ఒడిశా వంటి రాష్ట్రాల్లోనూ భారీగా కొత్త కరెన్సీ పట్టుకున్న ఘటనలున్నాయి.
మరోవైపు ఏటీఎంలకు డబ్బు నింపే సంస్థల ద్వారా కొత్త నోట్లు దారిమళ్లుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. బడాబాబులు తమ పరపతి ఉపయోగించి కొత్త నోట్లను నేరుగా కొల్లగొడుతున్నారని తెలుస్తోంది.