Begin typing your search above and press return to search.
బీజేపీ మార్క్ హిందూత్వ : అతివాదుల ఫిలాసఫీలో తేడా...?
By: Tupaki Desk | 25 Aug 2022 3:30 AM GMTబీజేపీ తేడా కలిగిన పార్టీ అని చెబుతారు. ఆ తేడా ఏంటి అంటే నెహ్రూ నాటి నుంచే దేశంలో హిందూత్వ విషయంలో గట్టిగా మాట్లాడడం. దానికి బేస్ ఎక్కడ ఉంది అంటే 1947 నాటి దేశ విభజన ఘటన. ఆ సమయంలో పాకిస్థాన్ నుంచి హిందువులు సిక్కుల శవాలు రైళ్ళలో గుట్టలుగా లాహోర్ నుంచి వచ్చి పడ్డాయి. ఒక విధంగా రక్తంతో తడిసిన దేశ విభజన అది. ఆ టైమ్ లో దేశం మూడ్ కచ్చితంగా హిందూత్వ వైపు ఉండవచ్చు. దానికి మరో కారణం ఏంటి అంటే ముస్లిమ్స్ కి ఈ దేశంలో స్వేచ్చ ఉండదని భావించి వారు సెపరేట్ దేశం అడగడం. ఆ విధంగా పాకిస్థాన్ ఏర్పడడం.
నిజంగా అయితే భారత్ లో మొత్తం ముస్లిమ్స్ పాక్ కి వెళ్ళిపోవాలి. అలాగే అక్కడ ఉన్న హిందువులు భారత్ రావాలి. కానీ అలా జరగలేదు. పాక్ ప్రాంతాలలో ఉన్న రెండు కోట్లకు పైగా హిందువులు అక్కడే ఇల్లూ వాకిళ్ళు చూసుకుంటూ ఉండిపోయారు. ఇక భారత్ నుంచి మొత్తం ముస్లిమ్స్ అటు వైపు వెళ్ళలేదు. తూర్పు బంగ్లాదేశ్ నుంచి, పంజాబ్ ప్రాంతాల నుంచి పాకిస్థాన్ విభజనలో ఉన్న ప్రాంతాలలో ఉన్న వారే వెళ్లారు.
అలా మత ప్రాతిపదికగా దేశ విభజన జరిగినా నాటికి 35 కోట్లుగా ఉన్న భారత జనాభాలో దేశంలోని అనేక ప్రాంతాలో ఉన్న ముస్లిమ్స్ ఎవరూ పాకిస్థాన్ పోలేదు. వారు భారత్ తమ జన్మభూమి కర్మభూమి అనుకున్నారు. ఇక తమ వైపు ఉన్న హిందువులను శవాలుగా చేసి రైళ్ళలో పాక్ పార్శిల్ చేయడం వెనక నూరు శాతం జనాభాలోనూ మత విభజన జరగాలనే. కానీ అలా పాక్ దుర్నీతి ఎంతలా ఉన్నాఆ పాచిక భారత్ లో ఏ కోశానా పారలేదు.
ఇక భారత్ నుంచి పాక్ అన్న భూభాగం వేరు పడింది తప్ప స్వాతంత్రానికి ముందు అన్ని మతాలతో భారత్ ఎలా ఉందో ఆ తరువాత కూడా అలాగే ఉంది. దాన్నే కొనసాగించాలని తొలి ప్రధాని నెహ్రూ నాయకత్వాన కాంగ్రెస్ భావించింది. అయితే అది అలా సాగుతూండగా పాక్ కవ్వింపులతో గడచిన డెబ్బై అయిదేళ్ళూ హిందూత్వ రాగాలు ఈ వైపున బీజేపీ వినిపించడానికి ఎంతో కొంత కారణం అవుతోంది. అయినా శతాబ్ద స్వాతంత్ర ఉత్సవాలకు దగ్గరగా భారత్ ప్రయాణం చేస్తోంది.
దేశంలో మత కలహాలు అంటూ పెద్దగా లేవు. అయితే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం ఉంది అంటే దాని మీద యాక్షన్ వేరేగా తీసుకోవాలి. ఇపుడు హిందూత్వ అంటూ గర్జించడం అంటే ఓట్ల రాజకీయమే ఎక్కువగా ఇందులో ఉందని భావించే వారూ ఉన్నారు. అయితే 1990 తరువాత హిందూత్వ కూడా అతి పెద్ద రాజకీయ ఆయుధంగా మారింది. బీజేపీకి ఆ వైపు నుంచి ఓట్ల పంట పండడంతో మిగిలిన పార్టీలు కూడా ఎంతో కొంత తొంగి చూడాల్సి వచ్చింది. అయితే బీజేపీ మాదిరిగా అవి కరడు కట్టిన సిద్ధాంతంతో ముందుకు దూకలేకపోతున్నాయి.
ఇక్కడే బీజేపీని తేడా కలిగిన పార్టీ అని చెప్పాలి. ఇక బీజేపీ ఫిలాసఫీ హిందూత్వ అయినా ఆ పార్టీ ఇప్పటికి అనేకసార్లు దేశాన్ని పాలిస్తున్నా కూడా టోటల్ గా హిందూత్వ దేశంగా భారత్ అని ప్రకటించే సాహసం అయితే చేయలేకపోతోంది. ఆ పార్టీకి తెలుసు. ఈ దేశం భిన్నత్వం. పైగా కేవలం హిందూత్వ తోనే అధికార పగ్గాలు అందవు అని. అందువల్ల బీజేపీ మార్క్ హిందూత్వ ఫిలాసఫీకి ఒక హద్దూ పరిధి ఉంది. అయితే బీజేపీలోనే పుట్టి పెరిగిన కొంతమంది అతివాదులకు మాత్రం ఈ ఫిలాసఫీ ఎంతవరకూ అర్ధమైందో తెలియదు కానీ వారు మాత్రం హిందూత్వ మీద బిగ్ సౌండ్ చేస్తూ వస్తున్నారు.
ఆ విపరీత ధోరణి ఇటీవల కాలంలో ఇంకా పెరిగిపోయింది. బీజేపీలో ఒక నూపుర్ శర్మ కొద్ది నెలల క్రితం ఇలాగే వీర హిందూత్వ తానే అని చెప్పుకుంటూ ప్రకంపనలు సృష్టిస్తే ఇపుడు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తాను మరో నాలుగాకులు ఎక్కువ చదివాను అన్నట్లుగా వీరంగం వేస్తున్నారు. వీరంతా బీజేపీకి చెందినవారే. కీలక నేతలే. మరి బీజేపీ మార్క్ హిందూత్వ వీరికి అర్ధం కాలేదా. లేక బీజేపీ ఒక రాజకీయ పార్టీగా తన మినహాయింపులను తెలుసుకుని ఆ విధంగా మసలుకుంటూ ఈ తరహా నేతలు వ్యవహార శైలిని చూసీ చూడనట్లుగా ఇంతకాలం వదిలేసిందా అని అనుమానం రాక మానదు.
ఒక నూపుర్ శర్మను పార్టీ నుంచి బహిష్కరించినట్లుగా రాజా సింగ్ ని చేయగలరా అంటే జవాబు లేదు. బీజేపీకి ఆయన కావాలి. ఆయన రూపంలో ఎమ్మెల్యే కూడా కావాలి. అయితే రాజాసింగ్ అయినా నూపుర్ శర్మ అయినా తమ ప్రాణాల కంటే కూడా హిందూత్వ ముఖ్యమని భావిస్తున్నారు. వారికి పరిధిలు పరిమితులతో పట్టింపు లేదు అక్కడే వస్తోంది తేడా. బీజేపీ ఫిలాసఫీ అన్నది రాజకీయ కోణంలో వీరు చూడలేకపోతున్నారా అన్న చర్చ కూడా వస్తోంది. ఏది ఏమైనా సరే ఒక నూపుర్ శర్మ, ఒక రాజా సింగ్ తో ఈ వ్యవహారం ఆగదు. బీజేపీలో ఇపుడు అసలైన సంఘర్షణ మొదలైంది.
నిజానికి బీజేపీ హిందూత్వకు అర్ధమేంటి, ఆ పార్టీ ఎంత వరకూ దాన్ని ఆమోదిస్తుంది. ఆ పరిధి దాటిన వారికి అందులో ఏ మేరకు స్థానం ఉంది ఇవన్నీ చర్చించాల్సిన అంశాలే. కేవలం ఓట్ల కోసమే హిందూత్వ అంటే బీజేపీలోని అతివాదులు ఇలాగే వీధిన పడతారు. తమ దోవ చూసుకుంటారు. అపుడు బీజేపీ కూడా మిగిలిన పార్టీల లెక్కన వీరు కట్టే ప్రమాదం ఉంది. మొత్తానికి రాజా సింగ్ ఫిలాసఫీకీ బీజేపీ ఫిలాసఫీకి తేడా ఏంటో తెలిస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అదే టైమ్ లో సమస్య జటినం కూడా కావచ్చు. ఒక్క మాట చెప్పాలీ అంటే బీజేపీ అనబడే పార్టీ హిందూత్వ అనే పులి మీద స్వారీ చేస్తోంది అని అంటున్నారు. మరి ఈ పులి ఏం చేస్తుంది అన్నది చూడాల్సి ఉంది.