Begin typing your search above and press return to search.
క్రికెట్లో కొత్త ప్లే ఆఫ్... ఐదు జట్ల పోటీ..
By: Tupaki Desk | 26 July 2019 10:04 AM GMTసాధారణంగా ఏ గేమ్ అయినా ప్లే ఆఫ్ దశ లేదా సెమీఫైనల్ కు వచ్చేసరికి మొత్తం నాలుగు జట్లు ఉంటాయి. ఈ జట్లలో ఫైనల్ కు రెండు జట్లు చేరతాయి. ఫైనల్స్ లో గెలిచిన జట్టు విజేత అవుతుంది. ప్రపంచకప్ నుంచి ఏ నాకవుట్ టోర్నమెంట్లు అయినా ఇలాగే జరుగుతుంటాయి. అయితే ఐపీఎల్ లో ఇందుకు భిన్నమైన పద్ధతి ప్రవేశపెట్టారు. ఫైనల్ కు ముందు నాలుగు జట్లే ఉంటాయి.
ఇక్కడ నాకవుట్ పద్ధతి కాస్త డిఫరెంట్ గా ఉంది. ఎలిమినేటర్, క్వాలిఫయర్ విధానంలో జరుగుతాయన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆస్ట్రేలియా దేశవాలీ టోర్నమెంట్ అయిన బిగ్ బాస్ లీగ్ ఇప్పుడు లోకల్ లీగ్ కు మరింత హంగులు అద్దుతూ ఐదు జట్లతో ప్లే ఆఫ్ మ్యాచ్ లను నిర్వహించాలన్న వినూత్న నిర్ణయం తీసుకుంది.
ఈ సరికొత్త ప్లే ఆఫ్ లో లీగ్ దశలో టాప్-5 లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్ కు అర్హత సాధిస్తాయి. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య క్వాలిఫయర్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు వెళుతుంది. ఇక 4- 5 స్థానాల్లో ఉన్న జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో ఓడిన జట్టు ఇంటికి వెళుతుంది. ఎలిమినేటర్ లో గెలిచిన జట్టు మూడో స్థానంలో ఉన్న జట్టుతో 'ది నాకౌట్' మ్యాచ్ ఆడుతుంది.
ది నాకౌట్ లో గెలిచిన జట్టు, క్వాలిఫయర్ గేమ్ లో ఓడిన జట్టుతో 'ది చాలెంజర్' గేమ్ ఆడుతుంది. ఇక్కడ గెలిచిన జట్టు తొలి మ్యాచ్ అయిన క్వాలీఫయర్ లో గెలిచిన జట్టుతో ఫైనల్ ఆడుతుంది. ఈ కొత్త ప్లే ఆఫ్ పద్ధతిపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. తొలి ఐదు స్థానాల్లో ఉన్న జట్లు అన్నింటికి ఒకే ఛాన్స్ ఇవ్వకుండా వాటి స్థాయిని బట్టి వాటికి నాకవుట్ మ్యాచ్ లు ఇవ్వడం బాగుందని కితాబు ఇస్తున్నారు.