Begin typing your search above and press return to search.
కొత్త విధానం ప్రారంభం: డాలర్లు లేకున్నా అమ్మొచ్చు..కొనొచ్చు!
By: Tupaki Desk | 9 May 2020 1:30 PM GMTభారత కరెన్సీ కాపాడేందుకు.. రూపాయిని బలోపేతం చేసేందుకు భారత ప్రభుత్వం కొత్త పథకం.. లేదా కొత్త కార్యక్రమం ప్రారంభించింది. INR-USD ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ (F&Q) కాంట్రాక్ట్స్‌ను శుక్రవారం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఉన్న GIFT ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాటిని లాంఛనంగా మొదలుపెట్టారు. ఈ సందర్భంగా రెండు అంతర్జాతీయ ఎక్స్చేంజీలు బీఎస్ఈకి చెందిన ఇండియా ఐఎన్ఎక్స్, ఎన్ఎస్ఈకి చెందిన ఎన్ఎస్ఈ-ఐఎఫ్ఎస్‌సీలపై ప్రారంభించారు. INR-USD ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ (F&Q) ప్రారంభం భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి దోహదం చేస్తుందని, భారత కరెన్సీ మార్కెట్లో ప్రమాదం, అస్థిరతను తగ్గించడంలో సహాయ చేస్తుందని ఆర్థికవేత్తలు, నిపుణులు పేర్కొంటున్నారు.
ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే ఒక్కమాటలో.. భవిష్యత్తు దృష్ట్యా రూపాయిని, డాలర్‌ను కొనుగోలు, విక్రయాలు చేయడం. రూపాయి ఈ ఏడాది నవంబర్ వరకు డాలర్ మారకంతో పడిపోతుందని అంచనా వేస్తే అప్పుడు F&O మార్కెట్‌లో డాలర్స్ కొనుగోలు చేయవచ్చు. ఒకవేళ రూపాయి పెరిగి డాలర్ తగ్గుతుందని భావిస్తే నవంబర్ కాంట్రాక్ట్‌తో డాలర్‌ను విక్రయించవచ్చు. అయితే దీనికి గడువు అనేది మీ ఇష్టం. ఎప్పుడైనా ఎంచుకోవచ్చు. మన వద్ద డాలర్లే లేనప్పుడు ఎలా అమ్మగలమని. అదే F&O మార్కెట్ ప్రత్యేకత. మీ వద్ద లేకుండానే విక్రయించవచ్చు. ఈ కొత్త కార్యక్రమంతో రూపాయికి విలువ పెరుగుతుందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. మరి ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.