Begin typing your search above and press return to search.
బీజేపీ ప్లే చేస్తున్న సరికొత్త రాజకీయం.. ఏపీలో వర్కవుట్ అవుతుందా?
By: Tupaki Desk | 8 Jun 2022 12:30 PM GMTవచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్న బీజేపీ పొత్తులు పెట్టుకుంటుందా? పెట్టుకోదా? రాజకీయంగా చర్చకు దారితీస్తున్న కీలక విషయం ఇది. ఎందుకంటే.. ప్రస్తుతం జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ.. తాజాగా నిర్వహిస్తున్న సభల్లో ఎక్కడా కూడా పొత్తుల విషయాన్ని ప్రస్తావించడం లేదు. అంతేకాదు.. పొత్తుల విషయాన్ని ఇప్పుడు ఎవరూ మాట్లాడరాదని.. ఎవరూ.. పెదవి విప్పరాదని కూడా చెబుతోంది. వాస్తవానికి బీజేపీకి అంత ధైర్యమే ఉంటే.. ఇక. పొత్తులతో పనేంటి? అనేది ప్రధాన ప్రశ్న.
ఇదే విషయాన్ని నేరుగా చెబితే.. ఎవరు మాత్రం కాదంటారు. పైగా ఒంటరిపోరు చేస్తామని చెబితే.. పార్టీ లోనూ బలం మరింత పెరిగే అవకాశం ఉంటుంది కదా! అయితే.. ఈ విషయంలో ఎటూ తేల్చకుండా.. నర్మగర్భంగా వ్యవహరించడమే ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. నిజానికి ఇతర రాష్ట్రాల్లోనూ బీజేపీ ఇదే తరహా వ్యూహం అనుసరించింది.
గోవాలో జరిగిన ఎన్నికల్లో ఎన్నికల ముందు వరకు కూడా ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకుంది. ఈ క్రమంలో తాము బలపడిపోతున్నామని.. ఒంటరిగానే అధికారంలోకి వస్తామని చెప్పడం గమనార్హం.
అంటే.. తామే ఒంటరిగా అధికారంలోకి వస్తామని.. బీజేపీ చెబుతోంది. ఇది నిజమనేనని.. అందరూ బావించేలా నమ్మించడమే ఇప్పుడు బీజేపీ నేతల ముందున్న వ్యూహం. వీరి మాటలు.. వీరి వాగ్దానాలు విన్న వారు.. ఔను నిజమేనేమో..అని అనుకునే పరిస్థితికి వస్తే.. వారి గొయ్యివారు తీసుకున్నట్టేనని అంటున్నారు. ఎందుకంటే.. ప్రస్తుతం బీజేపీ పరిస్థితి ఆశించిన విధంగా అయితే లేదు. అంతర్గత కుమ్ములాటలు.. నేతల మద్య సఖ్యలేమి.. వంటివి పీడిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో పార్టీ పుంజుకునేందుకు ఉన్న ఏకైక వ్యూహం.. లేనిది ఉన్నట్టు భ్రమింపజేయడం.. ఇంకే ముంది.. మేమే అధికారంలోకి వచ్చేస్తున్నాం.. అని చెప్పుకోవడం. ఇది గతంలోనూ అనేక రాష్ట్రాల్లో బీజేపీ చేసిన ప్లానే. అయితే.. దీనికి వశులై పోయిన చాలా మంది నాయకులకు ఇప్పటి వరకు అడ్రస్ లేకుండా పోయింది.
సో.. ఇప్పుడు ఏపీలో ప్లే చేస్తున్న ఈ ట్రిక్ కు నేతలు పడిపోతే.. కష్టమేనని అంటున్నారు పరిశీలకులు. పార్టీ పరంగా బీజేపీనే ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు.. ప్రజల మధ్య లేనప్పుడు.. అధికారంలోకి ఎలా వచ్చేస్తుందో.. నేతలే తేల్చుకోవాలని అంటున్నారు.