Begin typing your search above and press return to search.
జంపింగ్ తమ్ముళ్లకు కొత్త గుబులు!
By: Tupaki Desk | 13 Dec 2017 4:22 AM GMTజంపింగ్ తమ్ముళ్లకు కొత్త భయం పుట్టుకొచ్చింది. ఇచ్చిన హామీల్ని.. పదవి ఇచ్చినపార్టీని పక్కన పెట్టేసి.. కేవలం రాజకీయ స్వార్థం మినహా తమకింకేమీ లేవన్నట్లుగా వ్యవహరించే ఏపీ జంపింగ్ ఎమ్మెల్యేలకు ఇప్పుడు కొత్త వణుకు షురూ అయింది.
నమ్మిన పార్టీని నట్టేట ముంచేస్తూ తమ రాజకీయ స్వార్థం మినహా ప్రజలు పట్టని తీరుపై ఆగ్రహంతో ఉన్న ప్రజలు జంపింగ్ ఎమ్మెల్యేపై దాడి చేసిన వైనం కలకలం రేపుతోంది. తాజాగా ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గ పరిధిలో జరిగిన కార్యక్రమానికి జంపింగ్ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా గుర్తు తెలియని వ్యక్తులు అశోక్ పై కోడిగుడ్లను విసిరేశారు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు వీరంగం వేయటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోడిగుడ్లు విసిరేయటం అంటే ప్రజల్లో ఉన్న ఆగ్రహానికి నిదర్శనంగా చెబుతున్నారు.
ఈ ఉదంతం ఇప్పుగు జంపింగ్ ఎమ్మెల్యేలకు కొత్త గుబులు తీసుకొచ్చింది. ఏపీ విపక్ష నేత పాదయాత్రకు అంతకంతకూ ప్రజాదరణ లభిస్తుండటం.. పవర్ కోసం పార్టీని మోసం చేసి తమ దారిన తాము పోయిన వైనం ప్రజల్లో అసంతృప్తిని అంతకంతకూ పెంచుతుందన్న భయం ఇప్పుడు జంపింగ్ ఎమ్మెల్యేల్లో పెరిగింది.
ఎన్నికలు ఏడాదికి ముంచుకొస్తున్న వేళ.. ప్రజల్లో ఈ తరహీ ఫీడ్ బ్యాక్ రావటంపై కలవరానికి గురి చేస్తోంది. ఒకటి అరా ఘటనలు జరిగినా.. మీడియాలో ప్రముఖంగా రావటం.. పరువు మర్యాద పోవటంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర బ్యాడ్ కావటం ఖాయమని.. అదే జరిగితే టికెట్ల కేటాయింపులో మొండి చేయి తప్పదన్న మాట వినిపిస్తోంది.
దీంతో.. బయటకు వెళ్లాలంటేనే భయంగాఉందన్న మాట జంపింగ్ ఎమ్మెల్యేల్లో వినిపిస్తోందని చెబుతున్నారు. అందుకే బయటకు వెళ్లాలంటే ఆచితూచి వెళుతున్నారే తప్పించి.. గతంలో మాదిరి స్వేచ్ఛగా బయటకు వెళ్లలేని పరిస్థితి ఉందని చెబుతున్నారు. చేసిన పాపం ఊరికే పోదని ఊరికే అనలేదేమో?