Begin typing your search above and press return to search.

తొడ కొడుతున్న సమరసింహారెడ్డి నిర్మాత... ?

By:  Tupaki Desk   |   8 Jan 2022 8:30 AM GMT
తొడ కొడుతున్న సమరసింహారెడ్డి నిర్మాత... ?
X
వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కర్చీఫ్ వేసేందుకు అంతా రెడీ అయిపోతున్నారు. ఏ మాత్రం అవకాశం ఉన్నా అసలు వదలకూడదని డిసైడ్ అయిపోతున్నారు. విశాఖ జిల్లా విషయానికి వస్తే పాయకరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మీద సొంత పార్టీ నేతలే తిరుగుబాటు చేశారు. ఇది రాష్ట్ర స్థాయిలో కలకలం రేపింది. ఈ ఎమ్మెల్యే మాకు వద్దు అంటూ వైసీపీ క్యాడరే దండం పెట్టడం అంటే నిజంగా రాజకీయ విడ్డూరంగానే అంతా చూస్తున్నారు.

ఇక గొల్ల బాబూరావు మీద వైసీపీ హై కమాండ్ కూడా గుస్సాగా ఉందని టాక్. ఆయన నియోజకవర్గంలో పార్టీని కట్టు తప్పేలా చేశారని, క్యాడర్ తో ఎడం పెంచుకుని చివరికి వీధిన పడేలా చేసుకున్నారని కూడా అధినాయకత్వం భావిస్తోంది. మరో వైపు చూస్తే ఎమ్మెల్యే అవినీతి అంటూ సొంత పార్టీ కార్యకర్తలే ఆరోపించడాన్ని పార్టీ పెద్దలు సీరియస్ గా తీసుకుంటున్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే గొల్ల బాబూరావుకు మంత్రి పదవి ఆశలు కూడా ఈ దెబ్బకు కొట్టుకుపోయాయని అంటున్నారు. అంతే కాదు వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ కూడా డౌటే అన్న చర్చ కూడా ఉంది. పాయకరావుపేట వైసీపీలో రాజకీయం కూడా బాగా మారిపోతోంది. ఆ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకటరావు ఇపుడు ముందుకు వచ్చారు. ఆయన కొన్ని కేసుల వల్ల జైలు జీవితం కొంతకాలం గడిపారు. ఇపుడు ఆయన అన్నీ సరిచేసుకుని మళ్లీ జనాల్లోకి వచ్చేశారు.

ఇక ఆయన పొలిటికల్ ఎంట్రీ చిత్రంగా సాగింది. బాలయ్యతో ఆయన సమరసింహారెడ్డి మూవీని తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఆ తరువాత ఆయన టీడీపీలో చేరి 1999లో ఫస్ట్ టైమ్ పాయకరావుపేటకు ఎమ్మెల్యే అయ్యారు. టీడీపీ తరఫున ఆయన గెలిచి తన సత్తా చాటుకున్నారు. 2004లో మరోసారి గెలిచిన ఆయన్ని 2009 ఎన్నికలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన గొల్ల బాబూరావు ఓడించారు. ఇక 2014 నాటికి చెంగల వైసీపీలో చేరి పోటీ చేసి టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత చేతిలో ఓడిపోయారు.

ఇపుడు ఆయన ఒక్కసారిగా పాయకరావుపేట పొలిటికల్ సీన్లోకి వచ్చేశారు. ఆయన టీడీపీ మీద చంద్రబాబు మీద విమర్శలు ఎక్కుపెట్టడం ద్వారా వైసీపీ అధినాయకత్వం దృష్టిలో పడేందుకు చూస్తున్నారు. ఇప్పటికే బాబూరావు ఇమేజ్ డ్యామేజ్ అయినందువల్ల వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కడం కష్టమని అంటున్నారు. దాంతో చెంగల వెంకటరావు పోటీకి రూట్ క్లియర్ అయింది అంటున్నారు.

ఆయన విశాఖలో ఇపుడు నివాసం ఉంటున్నారు. ఇక మీదట పాయకరావు పేటకు రెగ్యులర్ గా వెళ్తూ అక్కడ తన పొలిటికల్ జోరుని చూపించాలని చూస్తున్నారు. ఇప్పటికే రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వంటి కీలక నేతలతో టచ్ లో ఉంటున్న చెంగల వెంకటరావు 2024 కి తానే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి అని చెప్పేసుకుంటున్నారు. మొత్తానికి బాబూరావు ఇపుడు ఎలా చూసుకున్న్నా ఇబ్బందులే ఎదురవుతున్నాయి అంటున్నారు.