Begin typing your search above and press return to search.
న్యూఇయర్ కానుక:బండి కొన్న దగ్గరే రిజిస్ట్రేషన్?
By: Tupaki Desk | 10 Nov 2015 5:50 AM GMTకొత్త బండి కొంటున్నారా? అయితే.. రెండు నెలలు ఆగితే చాలా బెటర్. కొత్త సంవత్సరంలో వాహనం కొనుగోలు చేసిన చోటే.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసేలా అధికారిక నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో.. ఆర్టీవో ఆఫీసుకు వెళ్లి.. అక్కడ గంటల కొద్దీ వెయిట్ చేసి.. బ్రోకర్లను పట్టుకొని.. వారి చేతిని తడపాల్సిన అవసరం దాదాపుగా ఉండకుండా ఉండేలా నిర్ణయం తీసుకోనున్నారు.
వాహనం కొనుగోలు చేసిన షాపులోనే ఆన్ లైన్ లో బండి రిజిస్ట్రేషన్ పూర్తి చేసే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిపై ఇప్పటికే వాహన విక్రేతలతో అధికారులు చర్చలు జరిపారు. వాస్తవానికి డిసెంబరు నుంచి ఈ కొత్త విధానాన్ని అమలు చేయాలని భావించారు. అయితే.. ఏర్పాట్లకు తమకు కొంచెం సమయం కావాలని కోరటంతో.. జనవరి నుంచి కొత్త విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
అదే కానీ జరిగితే.. కొత్త వాహనం కొన్న వెంటనే.. ఆర్టీవో ఆఫీసుకు వెళ్లి.. అక్కడ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేసే తిప్పలు తప్పుతాయి. చిన్న పట్టణాల్లో రద్దీ మినహా.. ఆర్టీవో కార్యాలయం ఎక్కువ దూరాన ఉండదు. కానీ.. పెద్ద పట్టణాలు.. నగరాల్లో అందుకు భిన్నమైన పరిస్థితి. నివాసానికి.. ఆర్టీవో ఆఫీసుకు మధ్య 5 నుంచి 30 కిలోమీటర్ల దూరాల్లో కూడా రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఉండటం.. కేవలం వాహన రిజిస్ట్రేషన్ కోసం ఒక రోజు.. హై సెక్యూరిటీ నెంబరు ప్లేట్ బిగించుకోవటం మరో రోజు సెలవు పెట్టాల్సిన పరిస్థితి. కొత్త విధానం అమలు అయితే.. ఈ తిప్పలు తప్పటం ఖాయం.
ఇక.. షోరూమ్ లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా పూర్తి చేస్తారన్న సందేహానికి అధికారులు సమాధానం ఇస్తున్నారు. సాధారణంగా ఆర్టీవో ఆఫీసు వద్దకు వెళ్లినప్పుడు మొత్తం ప్రక్రియలో ఇంజిన్ నెంబరు.. చాసిస్ నెంబరు చూసి.. వాహనకొనుగోలు పత్రాల మీద అవే నెంబర్లు ఉంటాయా? లేదా? అన్నది చూస్తారు. ఈ చిన్న విషయం.. షోరూం దగ్గరే.. షోరూం సిబ్బంది తమ బిల్లులో నమోదు చేసిన నెంబరును.. వాహనం మీద ఉన్న నెంబరును కొనుగోలు దారుకు చూపిస్తారు. ఈ రెండు సరిగా ఉన్నాయా? లేదా? అన్న విషయాన్ని చూసి.. కొనుగోలుదారు డిజిటల్ సంతకం పెట్టేస్తే..రిజిస్ట్రేషన్ ప్ర్రక్రియ పూర్తి అవుతుందని చెబుతున్నారు. కొత్త విధానంతో.. ఆర్టీవో ఆఫీసు తిప్పలు తప్పటం ఖాయం.
మరో లెక్కలో చూసుకుంటే.. సంవత్సరం చివర్లో వాహనం కొనుగోలు చేయటం తెలివైన నిర్ణయం కాదు. ఎందుకంటే.. ప్రస్తుతం నవంబరు నెలలో పది రోజులు గడిచిపోయాయి. అంటే.. కొత్త సంవత్సరానికి కేవలం 40 రోజుల దూరంలోనే ఉన్నాం. ఈ స్వల్ప వ్యవధిలో కొత్త వాహనం కొంటే.. అది ఈ ఏడాది వాహనం కిందనే ఉంటుంది. వాహన రంగంలో.. వాహనం ఎప్పుడు అమ్మినా..కొనుగోలు చేసిన ఏడాదిని మాత్రమే చూస్తారు తప్పించి నెలను పట్టించుకోరు. ఏడాదికి అనుసరించి దాని విలువను లెక్క వేస్తారు. ఈ నలభై రోజుల్లో కొన్నందుకు గడిచిన 10 నెలలకు సంబంధించిన తరుగు మీద పడిపోతుంది. దీని కారణంగా జరిగే ఆర్థిక నష్టమే చూస్తే.. ఒక ఏడాదికి టూ వీలర్ అయితే రూ.3 నుంచి రూ.6వేల మధ్య.. కారు అయితే రూ.10 నుంచి రూ.60 మధ్య తరుగుదల కింద తీసేస్తుంటారు. ఉదాహరణకు ఈ నవంబరులో ఒక టూవీలర్ కొని.. 2017 మార్చిలో అమ్మాలని డిసైడ్ అయ్యం అనుకుందాం. అప్పుడు వాహనాన్ని కొనుగోలు చేసే వారు.. దీన్ని రెండు సంవత్సరాల పాత వాహనంగా లెక్కిస్తారు. వాస్తవంగా చూస్తే.. 2015లో నలభై రోజులు.. 2016 12 నెలలు.. 2017లో మూడు నెలలు అంటే.. మొత్తంగా 18 నెలలకు.. అతగాడు లెక్కవేసేది 27నెలల పాతదిగా లెక్కిస్తారు. ఇది వాహనరంగంలో సాధారణమైన విషయం. ఈ కారణంతోనే.. ఏడాది చివరల్లో వాహనాలు కొనుగోలు చేయటానికి పెద్దగా ఆసక్తి చూపరు.
అంటే.. కేవలం నలభైరోజుల కోసం ఇంత భారీ మొత్తం నష్టపోవాల్సిన అవసరం లేదు. వాహనం ఏ నెలలో కొన్నప్పటికీ.. సంవత్సరం మాత్రమే ప్రామాణికం అయిన నేపథ్యంలో.. ఏడాది చివరల్లో వాహన కొనుగోలు ఏమాత్రం తెలివైన నిర్ణయం కాదని చెబుతుంటారు. దీనికి తోడు.. తాజాగా ప్రభుత్వం సైతం జనవరి నుంచి కొత్త నిర్ణయాల్ని అమలు చేయాలని భావవస్తున్న నేపథ్యంలో.. ఈ 40 రోజుల తర్వాత కొత్త సంవత్సరంలో వాహనం కొనుగోలు చేయటం రెండు రకాలుగా లాభమని చెప్పొచ్చు. అందుకే.. కొత్త వెహికిల్ కొనేవారు.. కొత్త సంవత్సరంలో కొంటే మంచిది.