Begin typing your search above and press return to search.
పెద్దల సభలో క్రిమినల్స్ ఉన్నారా ? దేవుడా !
By: Tupaki Desk | 17 Jun 2022 5:30 PM GMTరాజ్యసభకు ఇటీవల సమర్పించిన అఫిడవిట్లలో చాలా ఆసక్తిదాయక వివరాలు వెలుగుచూశాయి. వీటి ఆధారంగా మన నాయకుల నడవడి, పరిణితిని అంచనా వేయవచ్చు అని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఆస్తుల్లో, క్రిమినల్ కేసుల్లో,అప్పుల్లో అదేవిధంగా ఇతరేతర విషయాల్లో ఎవరేంటి అన్నది తెలుసుకోవచ్చు.
ఆశ్చర్యకరం ఏంటంటే మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (తెలుగింటి కోడలు) ఆస్తుల విలువ 9 శాతం తగ్గిపోయాయి. అదేవిధంగా కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ఆస్తుల విలువ ఐదు శాతం పెరిగిపోవడం ప్రస్తావనార్హం.
రాజ్యసభకు కొత్తగా 57 మంది ఎన్నికయ్యారు. ఇందులో 23 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ సంస్థ వెల్లడించిన వివరం ప్రకారం ..తాజాగా ఆసక్తిదాయక వివరాలు వెలుగులోకి వచ్చాయి. 12శాతం మందిపై హత్య, హత్యాయత్నం, దొంగతనం వంటి కేసులు నమోదు అయి ఉన్నాయి.
అంతేకాదు కేసుల జాబితాలో ఆంధ్రప్రదేశ్- కు చెందిన విజయ సాయిరెడ్డి రెండో స్థానంలో ఉన్నారు.ఆస్తుల జాబితాలో ఐదు వేల మూడు వందల కోట్ల రూపాయలతో బండి పార్థసారథి రెడ్డి నంబర్ ఒన్ స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. సాయిరెడ్డిపై ఇప్పటిదాకా 19 కేసులు నమోదు అయి ఉన్నాయి అని, వాటిలో 11 కేసులు సీరియస్ ఐపీసీ కేటగిరీకి చెందినవే అని ఆ నివేదిక వెల్లడి చేస్తోంది.
ఆస్తుల జాబితాలో పార్థసారథి తరువాత కాంగ్రెస్ పార్టీ పెద్దాయన కపిల్ సిబల్ ఉన్నారు.ఈయన ఆస్తుల విలువ రూ.608 కోట్లు అని అఫిడవిట్లో పేర్కొన్నారు. ఈయన తరువాత స్థానంలో ఆప్ నేత విక్రమ్ జిత్ సింగ్ ఉన్నారు.ఈయన ఆస్తుల విలువ రూ.498 కోట్లు అని తేలింది. ఇక క్రిమినల్ కేసుల సంఖ్యలో అనిల్ సుఖ్ దేవ్ బోండే (బీజేపీ) ముందు వరసులో ఉన్నారు. ఆయనపై 32 కేసులు నమోదు అయి ఉన్నాయి.
ఆయన తరువాత విజయసాయి రెడ్డి నిలవగా, అటు తరువాత స్థానంలో అంటే మూడో స్థానంలో సంజయ్ రౌత్ అనే శివసేన నేత 12 కేసులతో నిలిచారు. అప్పుల్లో మాత్రం బీద మస్తాన్ రేవు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈయన రెండోస్థానంలో నిలిచారు. తరువాత స్థానంలో తెలంగాణకు చెందిన దామోదర్ రావు (నమస్తే తెలంగాణ పత్రిక ఎండీ) నిలిచారు. ఆస్తులలో మాత్రం బీద మస్తాన్ రావుది ఆరో స్థానం అని తేలింది.