Begin typing your search above and press return to search.

శివ‌సేన ఎమ్మెల్యేల‌పై ఈడీ పిడుగు.. అందుకే యూట‌ర్న్‌?!

By:  Tupaki Desk   |   23 Jun 2022 9:30 AM GMT
శివ‌సేన ఎమ్మెల్యేల‌పై ఈడీ పిడుగు.. అందుకే యూట‌ర్న్‌?!
X
మ‌హారాష్ట్రంలోని శివ‌సేన‌-కాంగ్రెస్‌-ఎన్సీపీ మ‌హా కూట‌మి.. ప్ర‌భుత్వం కూలిపోయేందుకు సిద్ధ‌మైంది. ఈ రోజు రేప‌ట్లో ఇక్క‌డ స్ప‌ష్ట‌మైన‌.. నిర్ణ‌యం వెలువ‌డ‌నుంది. ఇప్ప‌టికే మ‌హా సీఎం, పులిబిడ్డ‌గా ప్ర‌చారంలో ఉన్న ఉద్ద‌వ్ ఠాక్రే.. త‌న అధికారిక‌నివాసాన్ని ఖాళీ చేశారు. రాత్రికిరాత్రి ఆయ‌న త‌న వ్య‌క్తిగత నివాసం.. మాతోశ్రీకి చేరుకున్నారు. ఈ నేప‌థ్యంలో మ‌హా రాష్ట్ర స‌ర్కారు కూలిపోయేందుకు సిద్ధ‌మైంద‌నే వాద‌న బ‌ల ప‌డుతోంది. ఇదిలావుంటే.. అస‌లు శివ‌సేన ఎమ్మెల్యేలు ఎందుకు యూటర్న్ తీసుకున్నార‌నేది ఆస‌క్తిగా మారింది.

ఎలాగైనా... మ‌హారాష్ట్ర‌లో త‌మ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల‌ని.. భావిస్తున్న బీజేపీ.. ఎన్‌ఫోర్స్‌మెం టు డైరెక్ట‌రేట్ను రంగంలోకిదించింద‌నే వాద‌న వినిపిస్తోంది. ఇటీవ‌ల కాలంలో ప‌లువురు శివ‌సేన నాయ‌కుల‌పై ఈడీ దాడులు నిర్వ‌హించింది.

వారం కింద‌ట కూడా.. శివ‌సేన కీల‌క సోద‌రుడి ఇంటిపై దాడి చేసిన ఈడీ కిలోల కొద్దీ బంగారాన్ని.. నిదుల‌ను స్వాధీనం చేసుకుంది. ఈనేప‌థ్యంలో.. బీజేపీతో ట‌చ్‌లో ఉన్న ఏక్‌నాథ్ షిండే ద్వారా.. శివ‌సేన‌లో బాగా సంపాయించుకున్నార‌నే ఆరోప‌ణ‌లున్న ఎమ్మెల్యేల‌ను త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేసింద‌ని అంటున్నారు.

ఇదే విష‌యాన్ని శివసేన అగ్రనేత సంజయ్ రౌత్ కూడా వెల్ల‌డించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ని బీజేపీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేసి శివసేన ఎమ్మెల్యేలపై ఒత్తిడి తీసుకొ చ్చిందని రౌత్ ఆరోపించారు.

ఈడీకి భయపడి పారిపోయిన ఎమ్మెల్యేలు నిజమైన బాల్‌థాక్రే అనుచరులు కాదన్నారు. మిగిలినవారమే నిజమైన భక్తులమన్నారు. తమకు కూడా ఈడీ ఒత్తిళ్లు ఉన్నాయి. అయినా శివసేనను వీడబోమని చెప్పారు. ఫ్లోర్ టెస్ట్ ఏర్పాటు చేస్తే ఎవరికి సానుకూలత, ఎవరికి ప్రతికూల అనే విషయాలు తెలుస్తాయని సంజయ్ రౌత్ విశ్వాసం వ్యక్తం చేశారు.

ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం పతన అంచున నిలబడిన వేళ రౌత్‌మ‌రిన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. శివసేన ఇంకా బలంగానే ఉందన్నారు. రెబల్ ఎమ్మెల్యేల్లోని 20 మంది తమతో టచ్‌లో ఉన్నారని ఆయన వెల్లడించారు. 'వారంతా(రెబల్ ఎమ్మెల్యేలు) ముంబై వస్తే ఎవరు మాతో ఉన్నారో తెలుస్తుంది. ఈ ఎమ్మెల్యేలంతా ఏయే పరిస్థితులు, ఒత్తిళ్ల మధ్య మమ్మల్ని వీడారో త్వరలోనే చెబుతా' అని సంజయ్ రౌత్ అన్నారు. మొత్తానికి కేంద్రంపైనే ఇప్పుడు ప్ర‌జాస్వామ్య వాదులు కూడా విమ‌ర్శ‌లు గుప్పిస్తుండ‌డం గ‌మ‌నార్హం.