Begin typing your search above and press return to search.

వాట్సాప్ కొత్త నిబంధన.. పంపితే జైలుకే

By:  Tupaki Desk   |   15 Jun 2019 5:36 AM GMT
వాట్సాప్ కొత్త నిబంధన.. పంపితే జైలుకే
X
వాట్సాప్.. ఇప్పుడు ఇది లేనిదే పూట గడవని పరిస్థితి. స్మార్ట్ ఫోన్ వచ్చాక ఈ ప్రత్యేక మెసేంజింగ్ యాప్ తో చాలా పనులు కానిచ్చేస్తున్నారు జనాలు. ఒకే ఒక్క మెసేజ్ తో క్షణాల్లో సమాచారాన్ని చేరవేస్తున్నారు. గ్రూపులు క్రియేట్ చేసి ఒక్క మెసేజ్ తో వందలాది మందికి తమ సమాచారాన్ని చేరవేస్తున్నారు. భారత్ లో వాట్సాప్ 200 మిలియన్ల యూజర్లు వాడుతుండడం విశేషం.

అయితే వాట్సాప్ ను మంచికి వాడితే మంచిదే..కానీ దుర్వినియోగం చేస్తేనే సమస్య. మొన్నటి ఎన్నికల వేళ భారత్ లో ఫ్రీ క్లోన్ యాప్స్ ద్వారా ఓటర్లకు పెద్ద సంఖ్యలో సందేశాలు పంపినట్లు వార్తలు వచ్చాయి. దీంతో కేంద్రం వాట్సాప్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే వాట్సాప్ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.

ఇకపై వాట్సాప్ లో బల్క్ సందేశాలు ఒకేసారి పంపడానికి వీల్లేకుండా వాట్సాప్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గుంపుగా ఇక అనేక మందికి ఒకసారి సందేశాలు పంపడానికి లేదు. ఒకవేళ పంపితే జైలు ఊచలు లెక్కబెట్టాల్సిందేనని వాట్సాప్ ఒక ప్రకటనలో హెచ్చరించింది.

ఈ డిసెంబర్ 7 నుంచి వాట్సాప్ అప్ డేట్ చేస్తామని.. అప్పటి నుంచి కొత్త నిబంధనలు వర్తిస్తాయని వాట్సాప్ తెలిపింది. అయితే కంపెనీ తీసుకునే చట్టపరమైన చర్యలు ఏంటో మాత్రం స్పష్టం చేయలేదు.