Begin typing your search above and press return to search.

తెలంగాణ : అమల్లోకి కొత్త రెవెన్యూ చట్టం.. గెజిట్ నోటిఫికేష‌న్ జారీ !

By:  Tupaki Desk   |   22 Sep 2020 5:36 PM GMT
తెలంగాణ : అమల్లోకి కొత్త రెవెన్యూ చట్టం.. గెజిట్ నోటిఫికేష‌న్ జారీ !
X
తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొచ్చిన నూత‌న రెవెన్యూ చట్టం ఈ రోజు (సెప్టెంబర్ 22) నుండి అమలులోకి వచ్చింది. రెవెన్యూ చట్టంతో పాటు మొత్తం 12 చట్టాల అమలుకు తెలంగాణ ప్రభుత్వం తాజాగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. భూ హ‌క్కులు – పాసు పుస్త‌కాలు, వీఆర్‌ వోల ర‌ద్దు, టీఎస్ బీపాస్, పుర‌పాల‌క‌, పంచాయ‌తీరాజ్‌, ప్రైవేటు వ‌ర్సిటీలు, తెలం‌గాణ విపత్తు, ప్రజా‌రోగ్య పరి‌స్థితి బిల్లు, తెలం‌గాణ ఉద్యో‌గుల పదవీ విర‌మణ వయసు క్రమ‌బ‌ద్ధీ‌క‌రణ బిల్లు, తెలం‌గాణ ఫిస్కల్‌ రెస్సా‌న్స్‌‌ బి‌లిటీ అండ్‌ బడ్జెట్‌ మేనే‌జ్ ‌‌మెంట్‌ బిల్లు, తెలం‌గాణ న్యాయ‌స్థా‌నాల రుసుము, దావాల మదింపు సవ‌రణ బిల్లు, తెలం‌గాణ సివిల్‌ న్యాయ‌స్థా‌నాల సవ‌రణ బిల్లుతో పాటు జీఎస్టీ స‌వ‌ర‌ణ చ‌ట్టాల అమ‌లుకు ప్ర‌భుత్వం గెజిట్ నోటిఫికేష‌న్లు జారీ చేసింది.

దీంతో బిల్లులు చట్ట రూపం దాల్చాయి. తాజా ఉత్వర్వులతో ఈ బిల్లుల‌న్నీ అధికారికంగా అమ‌ల్లోకి రానున్నాయి. కేసీఆర్ సర్కార్ కొత్తగా తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చట్టంపై రైతుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. భూ నిర్వహణలో సరళీకృత విధానానికి,అవినీతి రహిత సేవలకు ఈ చట్టం ఉపయోగపడుతోందని ప్రభుత్వం చెబుతోంది. ఈ చట్టం వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లను తహశీల్దార్లకు, వ్యసాయేతర భూముల రిజిస్ట్రేషన్లను సబ్ రిజిస్ట్రార్లకు దఖలు పరిచింది. ఇకపై రిజిస్ట్రేషన్ తో పాటూ మ్యుటేషన్ కూడా జరుగుతుంది. ఆ వివరాలన్నీ ధరణి వెబ్ ‌సైట్ ‌లో అప్ ‌డేట్ చేస్తారు.

వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లకు ఆన్‌ లైన్‌ లో ముందుగా స్లాట్ బుక్ చేసుకొని , ఆ రోజు మాత్రమ కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. గతంలోలాగా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లి గంటల కొద్దీ నిరీక్షించే అవసరం ఉండదు. ప్రభుత్వ భూములు,ప్రజా ఆస్తులకు ఆటో లాక్ చేస్తారు. అంటే ఎవరైనా అధికారి వాటిని రిజిస్ట్రేషన్ చేయాలని ప్రయత్నించినా కంప్యూటర్లో ఆ ఆటో లాక్ ఓపెన్ అవదు. అలాగే వారసత్వ భూములకు ఇకపై అధికారులు వచ్చి ఎంక్వైరీ చేసే పద్దతి ఉండదు.