Begin typing your search above and press return to search.
3 రోజుల్లో కొత్త రూల్.. గూగుల్ ఖాతా లాగిన్ కు ఇలా చేయాల్సిందే
By: Tupaki Desk | 5 Nov 2021 4:16 AM GMTరోజూ రెండు పూటల తింటారో లేదో కానీ.. రోజుకు పదులసార్లు గూగుల్ ను వాడకుండా ఉండనోళ్లు దాదాపుగా లేనట్లే. జియో పుణ్యమా అని.. సోషల్ మీడియాతోనూ.. యూట్యూబ్ తో లాగిన్ కాకుండా ఉండే పరిస్థితే లేదిప్పుడు. సాంకేతికత పెరిగే కొద్దీ కొత్త సమస్యలు విరుచుకుపడుతుంటాయి. అందుకు తగ్గట్లే సైబర్ దాడులు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. గతంలో చోరీలు జోరుగా సాగేవి. ఇప్పుడు అలాంటివి తగ్గిపోయి.. కంటికి కనిపించనంత దూరాన ఉంటూ.. జనాల అమాయకత్వాన్ని.. వారిలోని ఆశను తమకు అనుకూలంగా మార్చుకొంటూ దోచేస్తున్న వారి సంఖ్య ఎక్కువ అయిపోతున్నాయి.
సురక్షితమైన సేవల కోసం భద్రత పరంగా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఎక్కువైంది. ఇందులో భాగంగా ప్రఖ్యాత సెర్చింజన్ గూగుల్ తన సేవల్ని వినియోగించుకునే వారికి కొత్త తరహా ధ్రువీకరణను తప్పనిసరి చేయనుంది. 2ఎస్వీ అంటే రెండు అంచెల్లో చెక్ చేసే విధానాన్ని తప్పనిసరి చేసింది. దీనికి సంబంధించిన ప్రకటన ఈ ఏడాది మేలో చేయగా.. దాని ఆచరణ మరో మూడు రోజుల్లో మొదలు కానుంది.
నవంబరు 9 నుంచి గూగుల్ ఖాతాదారులు గూగుల్ అందించే సేవల్ని వినియోగించుకోవాలంటే తప్పనిసరిగా ఈ రెండు అంచల ధ్రువీకరణ చాలా అవసరం. 2021 చివరి నాటికి 150 మిలియన్ గూగుల్ యూజర్స్.. 2 మిలియన్ల యూ ట్యూబ్ యూజర్స్ ఈ ఫీచర్ ను వినియోగించక తప్పని పరిస్థితి. ఇంతకూ వారేం చేయాలి? సైబర్ నేరగాళ్ల నుంచి తప్పించుకోవటానికి గూగుల్ అందిస్తున్న రక్షణ కవచాన్ని ఎలా పొందాలో వెల్లడించింది.
ఈ రెండు అంచెల వెరిఫికేషన్ ను ఎనేబుల్ చేసుకుంటే.. గూగుల్ ఖాతా తెరిచిన ప్రతిసారీ వెరిఫై చేసుకునే ఇబ్బంది తప్పుతుంది. గూగుల్ ఖాతాను ఓపెన్ చేసినప్పుడు టూ స్టెప్ వెరిఫికేషన్ యాక్టివేషన్ చేయాలని చెబుతుంది. అప్పుడు మీ జీమొయిల్ ఐడీతో గూగుల్ లాగిన్ చేసిన తర్వాత కుడివైపున మీ పేరు లేదంటే మీ ఫోటో ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయాలి. అందులో ‘‘మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్’’ అని కనిపిస్తుంది. దాన్ని ‘‘క్లిక్’’ చేయాలి. అప్పుడు గూగుల్ అకౌంట్ ‘‘సెట్టింగ్స్’’ ఓపెన్ అవుతాయి. వాటిల్లో ‘‘సెక్యూరిటీ ఆప్షన్’’ మీద ‘‘క్లిక్’’ చేయాలి. దాన్ని కిందకు ‘‘స్క్రోల్ ’’ చేస్తే ‘‘టూ స్టెప్ వెరిఫికేషన్’’ ఫీచర్ కనిపిస్తుంది.
అక్కడ మీకు ‘‘ఆఫ్’’ అని కనిపిస్తే దాని మీద ‘‘క్లిక్’’ చేస్తే.. ‘వెరిఫికేషన్’ పూర్తి చేసేందుకు కంటిన్యూ చేయమని అడుగుతుంది. ఆ తర్వాత మీ ఫోన్ కు ‘‘ఓటీపీ’’ వస్తుంది. ఆ అంకెల్ని ‘‘టైప్’’ చేస్తే.. ‘టూ స్టెప్ వెరిఫికేషన్’ యాక్టివేట్ అవుతుంది. ఈ విధానాన్ని యూజర్స్ నవంబరు 9 లోపు ఎనేబుల్ చేసుకుంటే ఆటోమేటిక్ గా యాక్టివేట్ అవుతుంది. లేదంటే.. నవంబరు 9 తర్వాత తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే గూగుల్ సేవల్ని వినియోగించుకునే వీలుంటుంది.