Begin typing your search above and press return to search.
కరోనా: తెలంగాణ పరిస్థితి తీవ్రం..అతిక్రమిస్తే జైలే
By: Tupaki Desk | 23 March 2020 9:17 AM GMTతెలంగాణలో కరోనా వైరస్ 2వ స్టేజ్ లోకి రావడం.. కుటుంబ సభ్యులకు సోకుతుండడంతో కేసీఆర్ సర్కార్ అప్రమత్తమైంది. లాక్ డౌన్ ను కఠినతరం చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసులు.. జైలు శిక్షలు విధించేందుకు సిద్దమైంది.
తాజాగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ - తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణలో ఎవరైనా సరే నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించిన జనం సోమవారం ఎక్కడా కేసీఆర్ సర్కార్ విధించిన లాక్ డౌన్ పాటించలేదని.. దీన్ని తీవ్రంగా పరిగణించి రోడ్లపై కనిపించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
లాక్ డౌన్ నేపథ్యంలో రోడ్ల మీద ఒక్క వాహనం కనిపించినా చర్యలు తప్పవని తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ హెచ్చరించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎవరూ బయటకు రావద్దని స్పష్టం చేశారు. తెలంగాణలో 1897 చట్టం ప్రకారం లాక్ డౌన్ ప్రవేశపెట్టామని.. సరిహద్దులు మూసివేసి ఎమర్జెన్సీ విధించామని తెలిపారు. ఐదుగురు వ్యక్తులకు మించి రోడ్లపై కనిపిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక ఈ నిబంధనలు ఎన్నారైలు అతిక్రమిస్తే.. క్వారంటైన్ వెళ్లకుండా వారి పాస్ పోర్టులు సీజ్ చేస్తామని సీఎస్ సోమేష్ హెచ్చరించారు.
డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈరోజు మధ్యాహ్నం నుంచి తెలంగాణలో లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేస్తామని.. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజలంతా స్వీయ నిర్బంధంలో ఉండాలని విజ్ఞప్తి చేశారు. బయటకు వస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. నిత్యవసర వస్తువుల షాపులు సైతం రాత్రి 7 గంటలకు మూసివేయాలని హెచ్చరించారు. రోడ్డుపై వచ్చే ప్రతీ వాహనాన్ని పోలీసులు పరిశీలిస్తారని.. మీడియాకు మాత్రం ఎక్కడైనా తిరిగే అనుమతి ఉందని తెలిపారు.
* తెలంగాణ ప్రజలకు నిబంధనలు ఇవీ..
సోమవారం నుంచి 31 మార్చ్ వరకు తెలంగాణ లాక్‌డౌన్ అమలులో ఉంటుందని సీఎస్... డీజీపీ తెలిపారు. ఈ సందర్భంగా నిబంధనలు పొందుపరిచారు. ప్రజాలెవరూ రోడ్లపైకి రాకూడదని తెలిపారు. ఒక కాలనీలో వాహనంలో ఒకటి- రెండు కిలోమీటర్లు మాత్రమే తిరగాలన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎక్కువ సార్లు పోలీసుల దృష్టిలో పడితే ఆ వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు. సీజ్ చేసిన వాహనాలను వైరస్ తీవ్రత తగ్గిన తరువాత విడుదల చేస్తామన్నారు. ప్రైవేట్ వాహనాలు నిత్యావసర వస్తువులు క్యారీ మాత్రమే అనుమతిస్తామన్నారు. ప్రతి బైక్‌పై ఒక వ్యక్తి... కారు - ఇతర ఫోర్ వీలర్ పై ఇద్దరికి మాత్రమే అనుమతి అన్నారు. చట్టం ఉల్లంఘించిన వారిపై ఆరు నెలల జైలు శిక్ష వంటి కఠిన చర్యలు తప్పవని చెప్పారు. చట్టం అమలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. వచ్చే వారం పది రోజులు క్రమశిక్షణతో ఉండాలని బయట తిరగకుండా ఎవరికి వారు ఇళ్లలోనే ఉండాలని.. ఈ మధ్యాహ్నం నుంచే ఈ నిబంధనలు తెలంగాణలో అమల్లోకి వస్తాయని సీఎస్ - డీజీపీ సూచించారు.