Begin typing your search above and press return to search.
చైనాలో కరోనా వచ్చిందా? ఇక పెట్టెలో పెట్టేయడమే..!
By: Tupaki Desk | 14 Jan 2022 6:30 AM GMTప్రపంచానికి కరోనా మహమ్మరిని పరిచయం చేసిన దేశం చైనా. వ్యూహాన్ నగరంలో కరోనా కేసులు తొలుత వెలుగు చూడగా ఆ విషయాన్ని చైనా కొన్నిరోజులు బయటి ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడింది. ఆ తర్వాత ఆ మహమ్మరి ఇతర దేశాలకు పాకడంతో ఇక అసలు విషయం బయటపడక తప్పలేదు. చైనా దాగుడుమూతలకు ప్రస్తుతం ప్రపంచం శిక్షను అనుభవించాల్సిన రావడం శోచనీయంగా మారింది.
కరోనా వైరస్ ను అరికట్టేందుకు చైనా అప్పట్లోనే కఠిన నిబంధనలు అమలు చేసింది. దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేయడంతో కరోనా ఆంక్షలను కఠినంగా అమలు చేసింది. దీంతో ఆ దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఆ తర్వాత లాక్డౌన్ ఎత్తివేయడంతో మళ్లీ చైనాలో సాధారణ పరిస్థితులు ఏర్పడిన సంగతి తెల్సిందే.
ప్రస్తుతం కరోనాకు తోడుగా ఒమ్రికాన్ కేసులు ప్రపంచ వ్యాప్తంగా నమోదు అవుతున్నాయి. ఈక్రమంలోనే చైనా ఒమ్రికాన్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. దీనికితోడు వచ్చే నెలలో చైనాలోని బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ కు చైనా ఆతిథ్యం ఇవ్వనుంది. ఈనేపథ్యంలోనే డ్రాగన్ దేశం మరోసారి కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది.
చైనాలో ఎవరికైనా కరోనా వచ్చిందని అనుమానం వస్తే చాలు వారందరినీ ఓ ఇరుకైన మెలట్ బాక్సుల్లో ఉంచుతున్నారు. ఈ మెటల్ బాక్సుల్లో ఒక చెక్క మంచం, టాయిలెట్ మాత్రమే ఉంటాయి. కోవిడ్ రోగులతోపాటు వారి సన్నిహితులు, చుట్టుపక్కల ఉన్న వారందరినీ రెండు వారాలపాటు ఆ మెటల్లో బాక్సుల్లోనే ప్రభుత్వం ఉంచుతోంది.
మహిళలు, చిన్న పిల్లలు, గర్భిణీలు, వృద్ధులు అనే తేడా లేకుండా ఎవరైనా సరే పాజిటివ్ వస్తే ఈ మెటల్ బాక్సుల్లో ఉండాల్సిందే. ఈ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుండటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు లాకౌన్డ్ పరిమితుల కారణంగా జియాన్ ఆస్పత్రిలోకి ఎవరికీ ప్రవేశం కల్పించడం లేదు. దీంతో ఇటీవల ఓ గర్భణీ తను బిడ్డను కోల్పోవాల్సి వచ్చిందని ‘డెయిలీ మెయిల్’ పేర్కొంది.
ఆ మహిళకు కరోనా నెగిటివ్ రిపోర్టు వచ్చి 4గంటలు కావడంతోనే ఆమెను ఆస్పత్రిలో చేర్చుకోవడానికి నిరాకరించారని తెలుస్తోంది. చైనా ఇంత క్రూరంగా వ్యవహరిస్తుండటంపై ప్రభుత్వ తీరుపై చైనీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రజలను మెటల్ బాక్సుల్లో ఉంచుతున్న వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది. చైనా తీరుపై నెటిజన్లు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు.