Begin typing your search above and press return to search.
డబ్బు పడేస్తే.. ఫ్లైట్ జర్నీ అంతా మనిష్టం
By: Tupaki Desk | 14 April 2015 10:22 AM GMT''ప్రపంచంలో ప్రతిదానికి ఒక రేటు ఉంటుంది. దాన్ని ఇచ్చేయ్.. పని చేసేయ్'' అంటూ అత్తారింటికి దారేది సినిమా క్లైమాక్స్‌లో హీరో పవన్ కల్యాణ్ నోటి నుంచి వస్తాయి. నిజమే.. దేనికైనా సరే ఒక ''వెల'' ఉంటుంది. అది డబ్బు రూపంలో ఉండొచ్చు. మరో రూపంలో ఉండొచ్చు. అది కానీ ఇచ్చేస్తే.. సాధ్యం కానిది ఏదీ ఉండదు.
తీవ్రమైన పోటీతో పాటు.. నష్టాల బెడద ఎక్కువగా ఉన్న విమానయాన సంస్థలు లాభాల్లోకి వెళ్లేందుకు.. ఆదాయాన్ని పెంచుకునేందుకు పైన చెప్పిన కాన్సెప్ట్‌ని ఫాలోకావాలని డిసైడ్ అవుతున్నాయి. టిక్కెట్టు ధర పక్కన పెట్టి.. విమానం ఎక్కే వరకూ ఉండే తంతును నామమాత్రంగా చేసేందుకు ఎక్కడికక్కడ అదనపు మొత్తాన్ని చెల్లిస్తే చాలన్న కండీషన్‌ను తెరపైకి తీసుకొస్తున్నాయి.
దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే డైరెక్టరేట్ జనరల్ సివిల్ ఏవియేషన్‌కు పంపటం.. వారు సైతం పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారని చెబుతున్నారు. ఈ తాజా ప్రతిపాదనలు కానీ కార్యరూపం దాలిస్తే.. చేతిలో నోట్లు పట్టుకుంటే చాలు.. ఎయిర్‌పోర్ట్‌లో దర్జా వెలగబెట్టచ్చు.
ఇప్పటివరకూ చెకిన్ కోం టైం వేస్ట్ చేయటం మామూలే. ఇకపై అలాంటి నిరీక్షణలు ఏమీ లేకుండా నామమాత్రపు సమయంలో నేరుగా లాంజ్‌లోకి వెళ్లిపోవచ్చు. ఇక.. లాంజ్‌లో కూడా కూర్చోకుండా వీఐపీలకు కేటాయించే సౌకర్యాల్ని పొందొచ్చు. అంతేకాదు.. విమానంలో ఇచ్చే ఫుడ్‌ని తీసుకోవాల్సిన అవసరం లేదు. మాకు ఫలానా సర్వ్ చేయండని టిక్కెట్టు బుక్ చేసుకునేటప్పుడే చెప్పేస్తే.. ఎంచక్కా అదే భోజనాన్ని సర్వ్ చేస్తారు.
మరిన్ని సేవలు ఎలా చేస్తున్నారంటే.. దేనికి దానికి అదనంగా డబ్బు చెల్లిస్తే చాలు.. సేవలు పొందేయొచ్చు. వాస్తవానికి ఈ పద్ధతి ప్రాశ్చాత్య దేశాల్లో ఇప్పటికే అమల్లో ఉన్నాయి. తాజాగా.. భారత్‌లో కూడా ఈ విధానాన్ని అనుసరించాలని ఆలోచిస్తున్నారు. సివిల్ ఏవియేషన్ అధికారులు కానీ పచ్చజెండా ఊపేస్తే.. ఫ్లైట్ జర్నీలో దర్జా.. డాబు ప్రదర్శించుకునే వీలుంది.