Begin typing your search above and press return to search.
తెలంగాణ ప్రజలకు కొత్త రూల్.. ఇవాల్టి నుంచి మాస్కు పెట్టుకోకుంటే చర్యలే
By: Tupaki Desk | 28 March 2021 4:30 AM GMTనెమ్మదిగా పెరుగుతున్న కేసుల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సర్కారు మేల్కొంటోంది. పరిమితుల కత్తిని మరింత పదును తేల్చటంతో పాటు.. అజాగ్రత్తల జోరుకు కళ్లెం వేయాలని డిసైడ్ అయ్యింది. కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని కమ్మేస్తున్న వేళ.. కొన్ని రాష్ట్రాల్లో ఎదురవుతున్న తీవ్ర పరిణామాల్ని చూసిన తెలంగాణ సర్కారు కాస్త ఆలస్యంగానైనా మేల్కొన్నట్లుగా ఉంది తాజాగా విడుదల చేసిన జీవోను చూస్తే.
కరోనా వ్యాప్తిని కట్టడి చేసే క్రమంలో భాగంగా పలు పరిమితుల్ని.. చర్యల్ని పేర్కొంటూ తాజాగా జీవో జారీ చేసింది. బహిరంగ ఉత్సవాలు.. ఊరేగింపులపై ఏప్రిల్ 30 వరకు నిషేధాన్ని విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రజలు గుమిగూడటం.. ఒకే చోట చేరటంపైనా ఆంక్షలు విధించారు. ఇందులో భాగంగా పలు పర్వదినాల సందర్భంగా ఎలాంటి ఉత్సవాలు.. ర్యాలీలు నిర్వహించే వీల్లేదని తేల్చేసింది.
బహిరంగ స్థలాల్లో.. పార్కుల్లో ఎలాంటి సభలు.. సమావేశాలు నిర్వహించకూడదని స్పష్టం చేసింది. అంతేకాదు.. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు మాస్కు పెట్టుకోవటం తప్పనిసరిగా తేల్చింది. జనం సంచరించే బహిరంగ ప్రాంతాల్లో.. పని చేసే ప్రదేశాలతో పాటు.. ప్రజా రవాణాలోనూ ఈ నిబంధనను పాటించాల్సిందేనని పేర్కొంది. ఒకవేళ మాస్కు పెట్టుకోకుండా ఉంటే.. అలాంటి వారిపై 2005 విపత్తు నిర్వహణ చట్టంలోని 51 నుంచి 60 సెక్షన్లు.. ఐపీసీ 188వ సెక్షన్ ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. కాబట్టి.. తెలంగాణ రాష్ట్రంలో బయటకు వచ్చే వారు.. ముఖానికి మాస్కు విషయంలో కేర్ ఫుల్ గా ఉండాలి. లేకుంటే.. తిప్పలు తప్పవు.