Begin typing your search above and press return to search.

కొత్త జీతాలు ప్రాసెస్...వాట్ నెక్స్ట్...?

By:  Tupaki Desk   |   30 Jan 2022 10:49 AM GMT
కొత్త జీతాలు ప్రాసెస్...వాట్ నెక్స్ట్...?
X
ఒక వైపు ప్రభుత్వ ఉద్యోగులు మరో వైపు ప్రభుత్వం ఎవరి మటుకు వారు తమ మాటే రైట్ అని బిగదీసుకుని కూర్చున్న సన్నివేశం ఏపీలో ఉంది. ప్రభుత్వంలో ఉద్యోగులు భాగమంటూనే ప్రభుత్వం వారి విషయంలో ఉదాశీనంగా ఉంటోందని విమర్శలు ఉన్నాయి. మరో వైపు చూస్తే ఉద్యోగులు కూడా తాము ఎక్కడా అసలు తగ్గేది లే అంటున్నారు. ఇలా ఎవరికి వారు తమ పంధాలోనే ముందుకు సాగుతున్న వేళ ఒక బిగ్ ట్విస్ట్ అయితే చోటు చేసుకుంటోంది.

అదేంటి అంటే ఉద్యోగుల జీతాలు జనవరి నెలకు సంబంధించి చాలా స్పీడ్ గా ప్రాసెస్ పనులు అవుతున్నాయి. జనవరి నెల నుంచి కొత్త పీయార్సీ మేరకు జీతాలు చెల్లిస్తామని ప్రభుత్వం ఈపాటికే స్పష్టం చేసిన సంగతి విధితమే. ఈ నేపధ్యంలో ట్రెజరీ ఉద్యోగులు తాము జీతాలు కొత్త పే స్కేల్స్ మేరకు ప్రాసెస్ చేయమని చెప్పేశారు. అయితే ప్రభుత్వం సామ దాన భేద దండోపాయలను ఉపయోగిస్తోందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

ఈ నేపధ్యంలో కఠినంగా ఉంటామని ప్రభుత్వం నుంచి సంకేతాలు రావడంతో పాటు ఆది వారం రోజైనా పని చేసి తీరాలని జీతాలు టోటల్ గా కొత్త పే రివిజన్ తో ప్రాసెస్ చేయాల్సిందే అని సర్కార్ వైపున హుకుం జారీ కావడంతో మొత్తానికి కొత్త జీతాలతోనే ప్రాసెస్ వర్కు నాన్ స్టాప్ గా జరుగుతోంది.

ఇప్పటికి చూస్తే డెబ్బై శాతానికి పైగా జీతాలు ప్రాసెస్ అయ్యాయని ట్రెజరీ శాఖ డైరెక్టర్ మోహనరావు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాలను పాటించి ప్రాసెస్ ప్రక్రియను వేగవంతం చేశామని ఆయన వివరిస్తున్నారు. ఇప్పటిదాకా 25 వేల బిల్లులను ప్రాసెస్ చేయడం జరిగిందని, మిగిలినవి కూడా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. మరో వైపు 1.2 లక్షల బిల్లులు ప్రాసెస్ లో ఉన్నాయని కూడా వివరిస్తున్నారు.

ఇక ప్రభుత్వ ఆదేశాలు ఎవరైతే ఉద్యోగులు పాటించరో వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఆయన హెచ్చరించడం విశేషం. మొత్తానికి అనుకున్న గడువులోనే ప్రాసెస్ పూర్తి చేసి జీతాలను కొత్త పీయార్సీ మేరకు ఉద్యోగుల ఖాతాలోకి వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయంలో సర్కార్ సక్సెస్ అయితే మరి ఉద్యోగులు ఏం చేస్తారు. వాట్ నెక్స్ట్ అన్న చర్చ కూడా సాగుతోంది. చూడాలి మరి.