Begin typing your search above and press return to search.
కరోనాని ఎదుర్కోవడానికి నయా టెక్నాలజీ..ఏంటంటే?
By: Tupaki Desk | 29 March 2020 1:30 AM GMTకరోనా మహమ్మారి నుండి బయటపడటానికి ఉన్న అన్ని దారులని ప్రభుత్వం అన్వేషిస్తుంది. కరోనాకి ఇప్పటి వరకు సరైన వ్యాక్సిన్ లేకపోవడంతో .. వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. 21 రోజలుపాటే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించి వైరస్ వ్యాప్తి చెందకుండా ఆంక్షలు విధించింది. దీనికి ప్రధాన కారణం ..ఇతర దేశాల్లోలాగా భారతదేశంలో వ్యాధి విస్తరిస్తే మన దేశంలో అందకు తగ్గ వైద్య పరికరాలు కూడా లేవు. అయితే , కరోనా వ్యాప్తి మొదలైన వెంటనే చైనా వారం రోజుల్లోనే వెయ్యి పడకల ఆసుపత్రిని ఆఘమేఘాలమీద కట్టేసింది. అయితే, చైనా మాదిరి మన దగ్గర ఆసుపత్రి నిర్మాణం కూడా చేపట్టలేం.
అందుకే... కనెక్టెడ్ యూనిట్స్ ఫర్ రెస్పిరేటరీ ఎయిల్ మెం (కూరా) షిప్పింగ్ కంటెయినర్లనే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లుగా మార్చేసేంది. అవసరానికి తగ్గట్టు ..ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎప్పుడు కావాలంటే అప్పుడు తరలించేందుకు అనువుగా ఈ ఐసీయూలని తరలిస్తున్నారు. ఈ ఐసీయూలు విపత్కర పరిస్థితుల్లో బోలెడన్ని ప్రాణాలు కాపాడతాయనడంలో సందేహం లేదు. కార్లో రాట్టీ అసోసియాటీ - ఇటాలో రోటా - స్టూడియో ఎఫ్ ఎం మిలానో - హ్యుమానిటాస్ రీసెర్చ్ హాస్పిటల్ - జాకబ్స్ - స్క్వింట్ ఓపెరా తదితర సంస్థలన్నీ కలిసి ఈ వినూత్న ఐసీయూలను డిజైన్ చేసి తయారు చేస్తున్నాయి
నౌకల్లో సరుకుల రవాణాకు ఉపయోగించే 20 అడుగుల పొడవైన కంటెయినర్లను బాగా శుభ్రం చేసి - కిటికీలు - తలుపులు ఏర్పా టు చేస్తారు. వీటిని ఒకదానితో ఒకటి కలిపేందుకు బుడగల్లాంటి నిర్మాణాలను ఉపయోగిస్తారు. అవసరాన్ని బట్టి ఎక్కడికక్కడ గరిష్టంగా 40 పడకలతో కూడిన ఐసీయూ ఆసుపత్రిని సిద్ధం చేసుకోవచ్చన్నమాట. ఇవన్నీ ఎలా చేసుకోవాలన్నది అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి అవసరమైన వారెవరైనా ప్రపంచవ్యాప్తంగా వీటిని తయారు చేసుకోవచ్చు. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ఈ కంటెయినర్లను నెగిటివ్ ప్రెషర్ తో కూడా రూపొందించవచ్చు. క్షేత్రస్థాయి - తాత్కాలిక ఆస్పత్రుల ఏర్పాటుకూ ఇవి ఉపయోగపడతాయి. ప్రస్తుతం కూరా తొలి నమూనా ఐసీయూను మిలాన్ లోని ఓ ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేస్తోంది.