Begin typing your search above and press return to search.
మోడీకి కొత్త బిరుదు.. సూపర్ స్పైడర్.. ఇచ్చిందెవరో తెలుసా?
By: Tupaki Desk | 28 April 2021 6:30 AM GMTకీర్తి ప్రతిష్ఠలు కాలానికి లోబడి ఉంటాయి. ఏదీ శాశ్వితం కాదన్నట్లే.. పేరు ప్రఖ్యాతులకు సైతం ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుంది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల్ని చూస్తే.. యావత్ దేశం ప్రధాని మోడీని పొగడటమే కాదు.. పల్లెత్తు మాట అనేందుకు సైతం సాహసించలేని పరిస్థితి. ప్రజల్లో అంతటి ప్రేమాభిమానాల్ని సొంతం చేసుకున్న ఆయన.. కోవిడ్ సెకండ్ వేవ్ పుణ్యమా అని.. ఆయన తీవ్ర విమర్శలకు గురవుతున్నారు. అన్నింటికి మించి ఆయన మీద పడిన మరకను ఇప్పట్లో పోయేలా కనిపించటం లేదు.
మొదటి వేవ్ ను అధిగమించే విషయంలో ఆయనకు లభించిన మైలేజీ అంతా ఇంతా కాదు. అంతర్జాతీయంగా కూడా ఆయన ఇమేజ్ భారీగాపెరిగిపోయింది. ప్రపంచానికి రక్షకుడిగా ఆయన స్థాయి అందుకోలేనంతగా పెరిగింది. అలాంటిమోడీ తాజాగా తీవ్ర ఇబ్బందుల్నిఎదుర్కొంటున్నారు. అమాంతం పెరిగిన కోవిడ్ కేసులు.. మరణాలతో పాటు. ఆక్సిజన్ కొరత లాంటివి పట్టి పీడిస్తున్నాయి. ఇదే.. దేశంలో ఈ రోజున మరిన్ని మరణాలకు కారణంగా మారింది.
ఇలాంటివేళ.. మోడీకి కొత్త మరక అంటుకుంది. ఆయనకు కొత్తబిరుదును కట్టబెడుతున్నారు పలువురు ప్రముఖులు. తాజాగా భారతీయ వైద్య సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ నవ్ జ్యోత్ దహియా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రధాని మోడీ కొవిడ్ సూపర్ స్పైడర్ గా మారారని.. దేశంలోని ప్రస్తుత దుస్థితికి కారణం ఆయనేనని పేర్కొన్నారు.
కొవిడ్ నిబంధనల్ని ఫాలో కావాలని తాము నేర్పిస్తుంటే.. ప్రధాని మోడీ మాత్రం అందుకు భిన్నంగా.. నిబంధనల్ని ఉల్లంఘించి బెంగాల్ ర్యాలీలో పాల్గొన్నారన్నారు. దేశంలో కరోనా వైరస్ విస్తరిస్తుంటే..ఎన్నికల ర్యాలీలు.. కుంభమేళాలు నిర్వహించారన్నారు. చూస్తుంటే.. మోడీ మీద పడిన సూపర్ స్పైడర్ మరక ఇప్పట్లో పోయేలా లేదని చెప్పక తప్పదు.