Begin typing your search above and press return to search.

కొవిడ్ రోగులకు కొత్త టాయిలెట్.. మోసుకెళ్లిపోవ‌చ్చు!

By:  Tupaki Desk   |   1 Jun 2021 11:30 AM GMT
కొవిడ్ రోగులకు కొత్త టాయిలెట్.. మోసుకెళ్లిపోవ‌చ్చు!
X
కొవిడ్ వచ్చిన వారి పరిస్థితి దారుణం. ఇంట్లో వాళ్ల‌తో క‌ల‌వ‌లేరు. వారి స‌హ‌కారం లేకుండా సొంతంగా ప‌నులు చేసుకోలేరు. ఎలాగోలా ఓపిక తెచ్చుకొని త‌మ ప‌నితాము చేసుకున్నా.. టాయిలెట్ వినియోగం పెద్ద స‌మ‌స్య‌. టాయిలెట్ వ‌ద్ద‌కు వెళ్లిరావ‌డం ఒక‌ ఇబ్బంది అయితే.. ఇంట్లోని వారంతా ఒకేదాన్ని వినియోగిస్తే, మిగిలిన వారికి కొవిడ్ సోకుతుందేమోన‌నే భ‌యం కూడా ఉంది.

ఇలాంటి వారికోసం నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాన్ టెక్నాల‌జీ విద్యార్థి ప్ర‌తీక్షా మాజే ప్ర‌త్యేక‌మైన టాయిలెట్ ను రూపొందించారు. ఈ టాయిలెట్ కేవ‌లం వీల్ చైర్ అంత సైజులో ఉంటుంది. దీన్ని ఒక చోటు నుంచి మ‌రొక చోటుకు ఈజీగా త‌ర‌లించొచ్చు. కాబ‌ట్టి.. దీన్ని ఎక్క‌డైనా వినియోగించుకునే వీలుంటుంది.

క‌రోనా బారిన ప‌డిన త‌న అంకుల్ కోసం ఈ మ‌రుగు దొడ్డిని రూపొందించిన‌ట్టు చెప్పారు ప్ర‌తీక్షా. ఆక్సీజ‌న్ స‌పోర్టుతో ఉన్న ఆయ‌న‌.. రెగ్యుల‌ర్ టాయిలెట్ ను ఉప‌యోగించ‌లేక‌పోవ‌డంతో.. ఈ ప్ర‌య‌త్నం చేసిన‌ట్టు చెప్పారు. దీన్ని ఐదు నుంచి ఆరు సార్లు వినియోగించిన త‌ర్వాత శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంద‌ని తెలిపారు.

ఇక‌, ఈ మ‌రుగుదొడ్డిని త‌యారు చేయ‌డానికి 25 వేల రూపాయ‌లు ఖ‌ర్చు అవుతుంద‌ని చెబుతోంది ప్రతీక్షా. ఈ ఆవిష్క‌ర‌ణ‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. కొవిడ్ రోగుల‌కు ఇది ఎంతో అనువుగా ఉంటుంద‌ని అంటున్నారు. త్వ‌ర‌లో ఈ ఫార్ములాతో కార్పొరేట్‌ ఆసుప‌త్రుల‌ను కాంటాక్ట్ చేయ‌నున్న‌ట్టు చెప్పారు ప్ర‌తీక్షా మాజే.