Begin typing your search above and press return to search.

సికింద్రాబాద్ - విజయవాడ మధ్య కొత్త రైలు.. జర్నీ జస్ట్ 4 గంటలే!

By:  Tupaki Desk   |   14 Nov 2022 3:29 AM GMT
సికింద్రాబాద్ - విజయవాడ మధ్య కొత్త రైలు.. జర్నీ జస్ట్ 4 గంటలే!
X
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు దక్షణి మధ్య రైల్వే గుడ్ న్యూస్ ను చెప్పింది. దేశంలోనే అత్యంత వేగంగా పరుగులు తీసే వందే భారత్ రైళ్లను పట్టాల మీదకు తేవటం తెలిసిందే.

అయితే.. ఈ కొత్త రైళ్లు తెలుగు రాష్ట్రాలకు అందుబాటులోకి రాలేదు. ఈ కొరతను తీర్చేందుకు ఈ మధ్యనే తెలుగు రాష్ట్రాల మధ్య నడిచేందుకు ఒక రైలును కేంద్రం కేటాయించింది. దీన్ని కొత్త సంవత్సరం సందర్భంగా సర్వీస్ స్టార్ట్ చేయాలని భావిస్తున్నారు.

అయితే.. ఏ రూట్ లో ఈ ట్రైన్ ను నడపాలన్న దానిపై కసరత్తు చేసిన అధికారులు.. తాజాగా ఒక రూట్ ను డిసైడ్ చేశారు.గరిష్ఠ వేగంతో పరుగులు తీసే ఈ ట్రైన్ కు బెర్తులు ఉండవు.. కేవలం సీట్లు మాత్రమే ఉంటాయి. అందుకే.. నాలుగైదు గంటల వ్యవధిలో గమ్యస్థానాన్ని చేరుకునేలా ఈ రైళ్లను తీర్చి దిద్దారు.

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య బిజీగా ఉండే ప్రాంతాల్ని చేస్తే.. సికింద్రాబాద్ నుంచి విశాఖ.. విజయవాడ.. తిరుపతికి ఎక్కువ రద్దీ ఉంటుంది. మిగిలిన రూట్లతో పోలిస్తే.. సికింద్రాబాద్ - విజయవాడ మధ్య రద్దీ ఎక్కువగా ఉండటమే కాదు.. ప్రయాణ సమయాన్ని తక్కువకు కుదించే వీలుంది.

ఇప్పుడున్న రైళ్లు ఎవైనా.. సికింద్రాబాద్ - విజయవాడ మధ్య ప్రయాణ సమయం ఆరు గంటలకు పైనే తీసుకుంటోంది. దాని స్థానే పట్టాల మద్య పరుగులు తీయనున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు కారణంగా.. ఈ ప్రయాణ సమయం నాలుగు గంటలకు తగ్గిపోనుంది. దీంతో తెలుగు ప్రజలకు ప్రయాణ సమయం బాగా కలిసి రానుంది.

దీనికి తోడు ఈ మార్గంలో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో పాటు.. ప్రయాణికుల అవసరాన్ని తీర్చినట్లు అవుతుంది. రైల్వే శాఖకు ఆదాయాన్ని తెచ్చి పెట్టినట్లు అవుతుంది. ఒక పెద్ద మూవీ చూసి బయటకు వచ్చే సమయానికి సికింద్రాబాద్ నుంచి విజయవాడకు వెళ్లిపోవచ్చన్న మాట.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.