Begin typing your search above and press return to search.
ట్రంప్ బ్యాన్ పై మనోళ్లు రగిలిపోతున్నారు
By: Tupaki Desk | 8 March 2017 7:19 AM GMTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలన్నీ వివాదాస్పదం అవుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఆరు ముస్లిం దేశాల నుంచి వలసలను నిషేధిస్తూ అధ్యక్షుడు ట్రంప్ కొత్తగా జారీ చేసిన ఆదేశాలను ఓ పక్క వైట్ హౌస్ అధికారులు సమర్థిస్తుంటే, మరోపక్క భారత అమెరికన్లు తీవ్రంగా తప్పుపడుతున్నారు. అమెరికాను సురక్షితం చేయాలనే కారణంతో వలసలపై నిషేధం విధించటంవల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని అమెరికా కాంగ్రెస్ లో భారత అమెరికన్ సభ్యులు ట్రంప్ కు హితవు పలికారు. ఇలాంటి నిషేధాల వల్ల అమెరికా సురక్షితం అవుతుందనుకుంటే పొరపాటేనని స్పష్టం చేశారు. ‘ఈ నిషేధ ఉత్తర్వుల వల్ల మనం సురక్షితం కాలేము. మళ్లీ తప్పు చేయవద్దు’ అని అధ్యక్షుడికి ఇండో అమెరికన్ సభ్యులు హెచ్చరించారు. ‘దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న ఉగ్రవాద సమస్యను ముందుగా ఎదుర్కోవాలి. మార్పులవల్ల జరిగేదేం లేదు. ఇలాంటి ఉత్తర్వులు అనైతికం’ అని కాలిఫోర్నియా సెనెటర్ కమలా హారిస్ అన్నారు.
అయితే అమెరికా ప్రజాప్రతినిధులతో సమానంగా చట్టసభలో తొలిసారి ప్రవేశించిన భారత అమెరికన్ మహిళ కమలా హారిస్ సైతం గళం విప్పారు. హారిస్ తోపాటు మరి కొందరు సభ్యులు అమీ బెరా - రాజా కృష్ణమూర్తి - రో ఖన్నా - ప్రమీలా జయపాల్ లు కూడా ట్రంప్ ఉత్తర్వులపై స్పందించారు. ‘నిషేధిత దేశాల జాబితా నుంచి ఇరాక్ ను తొలగించటాన్ని నేను స్వాగతిస్తున్నా. అయితే ఈ ఆరు దేశాల నుంచి వలసల కారణంగా జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లుతుందనటానికి అధ్యక్షుడు ట్రంప్ సాక్ష్యాధారాలు చూపించాల్సి ఉంటుంది’ అని హారిస్ అన్నారు. అధ్యక్షుడు ట్రంప్ బాధ్యతారహితంగా, దేశంలో భయాందోళనలు సృష్టించేవిధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇది సరైన విధానం కాదని అన్నారు.
మరోవైపు ట్రంప్ తాజా ఎగ్జిక్యూటివ్ ఆదేశాలను ట్రంప్ పరిపాలన అధికారుల బృందం పూర్తిగా సమర్థించింది. వలసలపై అధ్యక్షుడు జారీ చేసిన ఉత్తర్వులు ఏ రూపంలోనూ ముస్లింలకు వ్యతిరేకం కానే కాదని స్పష్టం చేసింది. విదేశీ తీవ్రవాదుల నుంచి ఎదురవుతున్న ముప్పునుంచి అమెరికాను రక్షించటంకోసమే అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నారే తప్ప ఎవరిపైనా ఆయనకు వ్యతిరేకత లేనే లేదని పేర్కొంది. ‘ఇది తాత్కాలిక రద్దు మాత్రమే. ఈ ఆరు దేశాలు ఉగ్రవాదాన్ని నిరోధించటంలో విఫలమైనవో లేక ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నవి మాత్రమే. ఈ దేశాల నుంచి వస్తున్న ప్రతి ఒక్కరినీ పరిశీలించటం, పరీక్షించే వ్యవస్థ ప్రస్తుత పద్ధతుల ప్రకారం మన దగ్గర లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. ‘వివిధ దేశాల్లో వందలు - వేలు - లక్షల మంది ముస్లింలు ఉన్నారు. వారందరికీ ఈ ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులు వర్తించవు. అమెరికా వీసా తీసుకుని వారు మన దేశంలోకి ప్రవేశించవచ్చు. ఈ ఉత్తర్వులు ముస్లింలకు వ్యతిరేకం ఎంతమాత్రం కావని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి’ అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసర్ అన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/