Begin typing your search above and press return to search.

నగరాలలో నయా ట్రెండ్ ... లక్షల్లో ఆదాయం!

By:  Tupaki Desk   |   26 Oct 2019 6:08 AM GMT
నగరాలలో నయా ట్రెండ్ ... లక్షల్లో ఆదాయం!
X
హైదరాబాద్ , బెంగుళూరు , చెన్నై , ముంబై వంటి మహానగరాలలో ఉరుకులు పరుగులు మీద , ట్రాఫిక్ సమస్యని అధిగమించి ఆఫీసుకెళ్లి పనిచేయటం ఉద్యోగులకి ఒక యుద్ధం చేసినట్టు తయారౌతుంది. ఇంత శ్రమ పడి వెళ్లాక బాస్ తిడితే పడాలి , పక్కనోడి ఈర్ష్యను భరించాలి , ఉద్యోగానికి సరైన భద్రత లేకపోవడం, సెలవు కావాలంటే ఇబ్బంది పడుతూ అడగటం...దానికి ఎన్నో రూల్స్ఇలాంటి ఎన్నో ఒత్తిళ్ల మధ్య నగరవాసులు జీవనం కొనసాగిస్తున్నారు.

ఎన్ని భాదలు , టెంక్షన్స్ ని తట్టుకోలేని కొందరు తమ లైఫ్ స్టైల్ మార్చుకుంటున్నారు. తమకు వచ్చిన పని, నచ్చినప్పుడు ఇంట్లోనే కూర్చుని చేస్తున్నారు. తమకు తామే బాస్, ఇల్లే ఆఫీసు, ఇదే ఫ్రీ లాన్స్ జాబ్ సిటీలలో ఇప్పుడు ఈ ట్రెండ్ ఎక్కవైపోతుంది. ఆదాయానికి ఆదాయం ..మనకి నచ్చిన సమయంలో వర్క్ చేసుకోవచ్చు, మనల్ని అరవడానికి మనపై ఏ బాసు కూడా ఉండడు.

ఇలాంటి ఉద్యోగాలపై ఇప్పుడు సిటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. పెళ్ళైన ఆడవారు, విద్యార్థులు, రిటైర్డ్‌ ఉద్యోగులు ఇలా అన్ని రకాలవారు మహానగరంలో ఫ్రీలాన్స్‌ ఉద్యోగాలు చేస్తూ నెలకు 10 వేల రూపాయల నుంచి లక్షకు పైగా సంపాదించుకుంటున్నవారు లక్షల్లో ఉన్నారని లెక్కలు చెపుతున్నాయి. ముఖ్యంగా మెడికల్‌ ట్రాన్స్‌స్క్రిప్షన్, ట్రాన్స్‌లేషన్, ఐటీ అండ్‌ ప్రోగ్రామింగ్, గ్రాఫిక్‌ డిజైన్, కంటెంట్‌ రైటింగ్, డేటా ఎంట్రీ, మార్కెటింగ్, ఫొటోగ్రఫీ, ట్రావెల్‌ ఎక్స్‌పర్ట్, ఫుడ్‌ బ్లాగర్, ఇంటీరియర్‌ డిజైనింగ్, మొబైల్‌ యాప్‌ తయారీ, వెబ్‌సైట్‌ మేకప్‌ తదితర ఫ్రీలాన్స్‌ జాబ్స్‌తో ఎక్కువమంది ఉపాధి పొందుతున్నారు. పార్ట్‌టైమ్‌ లేదా ఫుల్‌టైమ్‌ చేసుకునే అవకాశం ఉండటం ఈ ఫ్రీలాన్సింగ్‌ ఉద్యోగాల ప్రత్యేకత.అర్బన్‌ క్లాప్‌ డాట్‌ కామ్‌ తదితర వెబ్‌ సైట్లు కూడా సర్వీసులు అందిస్తూనే ప్రొఫెషనల్స్‌కు జాబ్‌ అవకాశాలు అందిస్తుంది.