Begin typing your search above and press return to search.
భద్రం సుమా!: బెజవాడలో కొత్త దందా
By: Tupaki Desk | 10 Nov 2015 11:30 AM GMTఏపీ రాజధానిలో ఇప్పుడు రియల్ బూమ్ నడుస్తోంది. రాజధాని అమరావతికి ఏపీ ప్రభుత్వాన్ని మొత్తంగా తీసుకొచ్చేయాలన్న ఆలోచనలో ఉండటం.. అమరావతిలో ఇప్పటివరకూ నిర్మాణాలు షురూ కాకపోవటంతో.. బెజవాడ.. గుంటూరు తదితర ప్రాంతాల్లో జోరుగా రియల్ ఎస్టేట్ నడుస్తోంది.
డిమాండ్ కు తగ్గట్లుగా.. డబ్బులు దండుకునే వారు కొంతమంది అయితే.. జనాల నమ్మకాన్ని దోచుకునే కార్యక్రమాన్ని కొందరు మొదలు పెట్టారు. అలాంటి ఉదంతం తాజాగా ఒకటి బయటకు వచ్చింది. ఒకే ఫ్లాట్ ను పలువురికి అమ్మి.. మోసం చేసి.. రూ.15కోట్లతో పత్తా లేకుండా పోయిన ఘరానా మోసగాడి ఉదంతం ఒకటి తాజాగా బయటకు వచ్చింది. చలసాని శ్రీకృష్ణ అనే బిల్డర్ ఫ్లాట్ల పేరుతో చేసిన మోసం విని షాక్ తింటున్నారు. ఎందుకంటే.. స్టాంప్ పేపర్ల మీద అంతా పక్కాగా వ్యవహారం నడుస్తున్నట్లుగా నమ్మించి మోసం చేయటం గమనార్హం.
విజయవాడలోని ప్రసాదంపాడుకు చెందిన ఒక బిల్డర్ 45 మంది నుంచి రూ.15కోట్లు వసూలు చేశాడు. బాధితులు పలువురు ఒక్కొక్కరు రూ.20 నుంచి రూ.30లక్షల వరకూ ఇచ్చి మోసపోయిన వారే కావటం గమనార్హం. ఒకే ఫ్లాట్ ను ఒకరికి తెలీకుండా మరొకరికి అమ్మినట్లుగా తెలుస్తోంది.
కొద్దిరోజులుగా బిల్డర్ ఆచూకీ లేకుండా పోవటం.. సందేహం వచ్చి.. చెక్ చేస్తే భార్య.. ఫ్యామిలీ మెంబర్లతో ఉడాయించినట్లు చెబుతున్నారు. మోసం చేసి సంపాదించిన డబ్బుతో ప్రకాశం జిల్లాలో పొలాలు కొన్నట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉన్నాడని ఆరోపిస్తూ.. సదరు బిల్డర్ మీద బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయటం వారు కేసు నమోదు చేసి.. నిందితుడి కోసం వెతుకుతున్నారు. గత కొద్ది రోజులుగా విజయవాడ.. గుంటూరులలో అద్దెలు భారీగా పెరగటం.. రాజధాని బూమ్ ఎక్కువగా ఉండటంతో.. పలు రియల్ మోసాలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. అందుకే.. విజయవాడ.. గుంటూరు పరిసర ప్రాంతాల్లో భూములు.. ఫ్లాట్లు కొనే వారు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే డబ్బులు ఇవ్వాలని.. లేకుండా ఇలాంటి మోసాలకు గురి కావాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.