Begin typing your search above and press return to search.

డేటింగ్ లో కొత్త ట్రెండ్స్..

By:  Tupaki Desk   |   31 Dec 2022 6:29 AM GMT
డేటింగ్ లో కొత్త ట్రెండ్స్..
X
పెళ్లి జీవితం రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు పెళ్లి చేసుకోవాలంటే అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూడాలని పెద్దలు చెప్పేవాళ్లు. ఆ తరువాత పెళ్లిచేసుకునే అమ్మాయి, అబ్బాయి ఇష్టపడితే చాలు.. అని అన్నారు. అయితే కొన్ని పరిస్థితుల వల్ల అమ్మాయిల సంఖ్య తక్కువైంది. దీంతో పెద్దలు సైతం నిబంధనలు పక్కనబెట్టి.. అమ్మాయి ఎలా ఉన్నా.. క్యాస్ట్ తో సంబంధం లేకుండా పెళ్లిళ్లు చేశారు. ఇది మొన్నటి వరకు జరిగిన తంతు. కానీ ఇప్పుడు కొత్త ట్రెండ్ పుట్టుకొచ్చింది. కాస్త ఉన్నత చదువులు చేసిన వారు తల్లిదండ్రుల అభిప్రాయాన్ని పక్కనబెట్టి వారే తమ భాగస్వామిని సెలక్ట్ చేసుకుంటున్నారు. అవసరమైతే పెళ్లికిముందే అన్నీ కానిచ్చి ఆ తరువాత పేరేంట్స్ ఓపినియన్ తీసుకుంటున్నారు. అయితే ఇలా పరిచయం కావడానికి చాలా మంది డేటింగ్ యాప్స్ ను ఫాలో అవుతున్నారు. ఇందులో ఉన్న ఫీచర్లను అనుసరించి కొత్త రిలేషన్ షిప్ ను మెయింటేన్ చేస్తున్నారు.

పెళ్లికి ముందు వేరే వారితో సంబంధం ఉన్న వాళ్లను ఒకప్పుడు చాలా తప్పుపట్టేవాళ్లు. అలాంటి అబ్బాయి లేదా అమ్మాయి గురించి బయట తెలిస్తే ఇక వారికి పెళ్లిళ్లు కావనే భావన ఉండేది. కానీ ఇప్పుడు పెళ్లికి ముందే అన్నీ చేస్తున్నారు. అన్నీ అంటే ముద్దుల నుంచి మొదలు పెడితే పడక గదిలోకి వెళ్లేవరకు.. ఇలాంటివి కొన్ని సినిమాల్లోనూ చూపించడంతో నేటి యువత దానినే ఫాలో అవుతున్నారు. పెళ్లికి ముందు ఈ రిలేషన్ షిప్ మెయింటేన్ చేయడం వల్ల ఒకరి గురించి మరొకరు పూర్తిగా తెలుసుకొని ఆ తరువాత పెళ్లి చేసుకుంటామని చెబుతున్నారు.

భాగస్వామిని వెతుక్కోవడానికి ఇప్పుడు చాలా మంది మ్యాట్రిమొనీ కోసం చూడడం లేదు. డేటింగ్ యాప్స్ ను డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. ఈ యాప్స్ ద్వారా తమకు నచ్చిన అమ్మాయిని లేదా అబ్బాయిని సెలెక్ట్ చేసుకొని వారికి వీడియోకాల్ చేస్తున్నారు. ఆ తరువాత ప్రత్యక్షంగా కలుసుకుంటున్నారు. ఇలా ఒకరికొకరు నచ్చితే పెళ్లికి ముందే సంసార జీవితాన్ని సాగిస్తున్నారు. ఈ నాగరికత ఒకప్పుడు మెట్రో నగరాల్లో మాత్రమే ఉండేది. ఇప్పుడు పట్టణాలు, నగరాల్లోను పాతుకుపోతుంది. కొందరు తల్లిదండ్రులు తమ చేయి దాటిన తరువాత ఏం చేయలేని పరిస్థితి ఎదురవుతోంది.

సెక్షన్ 294 ప్రకారం వ్యభిచారం తప్పు. కానీ కొన్ని రోజుల కిందట ఇద్దరు భాగస్వాములు ఇష్టపూర్వగా కలిసి జీవించొచ్చని కోర్టులు సైతం చెప్పాయి. సహజీవనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. దీంతో యువత మరింతగా రెచ్చిపోతున్నారు. డేటింగ్ యాప్స్ పేరుతో చాలా మంది ప్రత్యక్ష వ్యభిచారానికి పాల్పడుతున్నారు. అయితే ఇందులో కొన్ని పేర్లను కూడా సమకూర్చారు. ఒక ఆడ, మగలు కలిసి కొన్ని రకాల పద్ధుతుల్లో కలిసి ఉండొచ్చని ఆ పేర్లు చెబుతున్నాయి.

-రోచింగ్- ఒకేసారి నలుగురు, ఐదుగురితో గడపడం..
బ్రెడ్ కంబింగ్-కేవలం తినడానికి మాత్రమే వీరు కలిసుంటారు. అంటే డబ్బు అవసరాల కోసం స్నేహం చేయడం అన్నమాట. ఇంకా లవ్ బాంబింగ్, ఓపెన్ రిలేషన్ షిప్ లాంటి ఏన్నో పేర్లతో చాలా మంది యువత పెళ్లికి ముందే కలిసి ఉండడానికి ఇష్టపడుతున్నారు. పెళ్లయిన తరువాత ఏలాగూ రొటిన్ జీవితం. కానీ పెళ్లికి ముందే ఇలా లైఫ్ ను ఎంజయ్ చేయాలని చాలా మంది యువత ఆరాటపడుతున్నారు. కానీ ఇది ఎక్కడికి దారి తీస్తుందో తెలియని పరిస్థితి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.