Begin typing your search above and press return to search.

ఏపీలో కొత్త జిల్లాలు.. కానీ.. స‌రికొత్త ట్విస్ట్ ఇదే!

By:  Tupaki Desk   |   27 July 2019 4:22 AM GMT
ఏపీలో కొత్త జిల్లాలు.. కానీ.. స‌రికొత్త ట్విస్ట్ ఇదే!
X
ఏపీలో ఏర్ప‌డిన కొత్త ప్ర‌భుత్వం త‌న‌దైన ముద్ర ఉండేలా పాల‌న‌లో స‌రికొత్త పుంత‌లు తొక్కుతోంది.ఈ క్ర‌మంలోనే రాష్ట్రం పైనా సుదీర్ఘ కాలంపాటు వైసీపీ ముద్ర ఉండేలా చూస్తున్నారు పాల‌నాధిప‌తి - సీఎం జ‌గ‌న్‌. ఈ క్ర‌మంలోనే ఆయ‌న జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకున్నారు. త‌న ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల మేర‌కు ఆయ‌న కొత్త‌గా జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించిన క‌స‌ర‌త్తు కూడా ముమ్మ‌రంగా సాగు తోంది. ప్ర‌స్తుతం ఉన్న 25 పార్ల‌మెంటు స్థానాల‌ను జిల్లాలుగా చేస్తామ‌ని పాద‌యాత్ర సమ‌యంలో జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. దీనికి అనుగుణంగానే ఆయ‌న తాజాగా క‌స‌ర‌త్తును ముమ్మ‌రం చేశారు.

ప్ర‌స్తుతం రాష్ట్రంలో 13 జిల్లాలు ఉన్నాయి. వీటిని పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల సంఖ్య ప్ర‌కారం కొత్త జిల్లాల‌ను ఏర్పాటు చేయ‌డం ద్వారా మ‌రో 12 కొత్త జిల్లాలు ఏర్ప‌డ‌తాయి. మొత్తం పాతిక జిల్లాల‌తో ఏపీ క‌ళ‌క‌ళ‌లాడ‌డం ఖాయం. అయితే, ఈ క్ర‌మంలో పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాన్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేయ‌డం ద్వారా స‌రికొత్త స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం పార్ల‌మెంటు ప‌రిధిలో ఉన్న కొన్ని కీల‌క‌మైన ప‌ట్ట‌ణాలు ఆయా నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో చేరితే. ఇప్పుడున్న అస్తిత్వానికి ముప్పు వాటిల్లే అవ‌కాశం ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఆయా జిల్లాల ఏర్పాటులో స‌మ‌స్య‌లు ఉత్ప‌న్న‌మ‌వుతాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఉదాహ‌ర‌ణ‌కు కృష్ణా జిల్లానే తీసుకుంటే.. ఇక్క‌డ రెండు పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. మ‌చిలీప‌ట్నం - విజ‌య‌వాడ‌. మ‌చిలీప‌ట్నం ఎంపీ స్థానంలోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలను ఒక‌టిగా చేసి జిల్లాగా ఏర్పాటు చేస్తే.. విజ‌య‌వాడ ఎంపీ ప‌రిధిలోని కీల‌క‌మైన ప్రాంతాలు ఆ జిల్లాలో మ‌కుటాయ‌మానంగా ఉన్నాయి. పెన‌మ‌లూరు - తాడిగ‌డ‌ప‌ - గ‌న్న‌వ‌రం - రామ‌వ‌ర‌ప్పాడు - బెంజిస‌ర్కిల్ వంటి ప్రాంతాలు విజ‌య‌వాడ ప‌రిధిలో కీల‌క‌మైన ప్రాంతాలు. అయితే, ఇప్పుడు మ‌చిలీప‌ట్నం ను ఓ జిల్లాగా ఏర్పాటు చేయ‌డం ద్వారా ఈ ప్రాంతాల ప‌రిధి మారిపోయి.. ఏకంగా విజ‌య‌వాడ కార్పొరేష‌న్ ప‌రిధికే ముప్పు వాటిల్లే ఛాన్స్ ఉంటుంది.

అదేవిధంగా గుంటూరు - నెల్లూరు - తిరుప‌తిలోని కొన్ని పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాలు ప‌క్క జిల్లాల్లో ఏర్ప‌డ్డాయి. వీటిని ఇప్పుడు క‌దిలిస్తే.. కొత్త జిల్లాల‌ను ఏర్పాటు చేస్తే.. ఇప్పుడున్న న‌గ‌రాలు ఏక‌ మొత్తంగా మారిపోయి.. కార్పొరేష‌న్లు - మునిసిపాలిటీల ప‌రిధి కూడా మారిపోనుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని జిల్లాల ప‌రిధిని కుదించేందుకు - ఎలాంటి వివాదాలు - నిర‌స‌న‌లు లేకుండా - రాకుండా కొత్త జిల్లాల‌ను ఏర్పాటు చేసేందుకు కూడా ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు ముమ్మ‌రం చేసినట్టు స‌మాచారం . మ‌రి ఎలా ప‌రిష్క‌రిస్తారో చూడాలి.