Begin typing your search above and press return to search.

కర్ణాటక ఎమ్మెల్యే కిడ్నాప్.. ఇప్పుడెక్కడంటే?

By:  Tupaki Desk   |   19 July 2019 7:39 AM GMT
కర్ణాటక ఎమ్మెల్యే కిడ్నాప్.. ఇప్పుడెక్కడంటే?
X
కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ సర్కారు కూలుతుందా.? ఉంటుందా అన్న చర్చ సాగుతోంది. కర్ణాటక అసెంబ్లీలో దీనిపై హాట్ హాట్ గా వాతావరణం నెలకొంది. అయితే విశ్వాస పరీక్ష నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీమంత్ బాలా సాహెబ్ పాటిల్ కనిపించకుండాపోవడం చర్చనీయాంశంగా మారింది. శ్రీమంత్ పాటిల్ ను బీజేపీయే కిడ్నాప్ చేసిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.. ఈ మేరకు కర్ణాటక పీసీసీ కార్యదర్శి ఎఎన్ గౌడ గురువారం రాత్రి బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ అలోక్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. లక్ష్మణ్ సంగప్ప అనే బీజేపీ ఎమ్మెల్యేనే తమ ఎమ్మెల్యే శ్రీమంత్ ను కిడ్నాప్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. లక్ష్మణ్ సంగప్ప, శ్రీమంత్ చెన్నై విమానాశ్రయంలోనే కనిపించిన ఫొటోలను ఫిర్యాదు చేశారు. బలపరీక్షను ఎదుర్కోవాల్సి ఉండడంతోనే తమ కాంగ్రెస్ ఎమ్మెల్యేను బీజేపీ కిడ్నాప్ చేసిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

కాగా అంతకుముందు ఇదే విషయంపై కాంగ్రెస్-జేడీయూ సభ్యులు తీవ్ర స్థాయిలో ఆందోళన చేశారు. అసెంబ్లీలో నినదించారు. కాగా స్పీకర్ రమేష్ కుమార్ కూడా శ్రీమంత్ కిడ్నాప్ అయ్యాడని సభలో అధికారికంగా ప్రకటించారు. దీనిపై విచారణ జరపాలని హోంమంత్రిని ఆదేశించారు. బలపరీక్ష సమయంలోనే శ్రీమంత్ అదృష్టంపై సీరియస్ గా తీసుకోవాలని సూచించారు.

*ముంబై ఆస్పత్రిలో శ్రీమంత్..
కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ను కూల్చడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీమంత్ ను బీజేపీ కిడ్నాప్ చేసిందన్న ఆందోళన నేపథ్యంలో ఆయన ఎక్కడున్నారనే విషయం వెలుగుచూసింది.. ముంబైలోని ఓ ఆస్పత్రిలో గుండెనొప్పితో ఓ ఆస్పత్రిలో చేరినట్టు తెలిసింది.

ఇక కిడ్నాప్ వార్తలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీమంత్ నోరువిప్పారు. ఓ అత్యవసర పని మీద తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేల క్యాంప్ నుంచి చెన్నై వెళ్లానని.. అక్కడ గుండెనొప్పి రావడంతో చెన్నై ఆస్పత్రిలో చికిత్స తీసుకొని ముంబైలో తాను తరుచూ వెళ్లే ఆస్పత్రిలో చేరానని వివరణ ఇచ్చారు. తన ఆరోగ్యం కుదటపడగానే బెంగళూరుకు వస్తానని తెలిపారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు..

కాగా ఎమ్మెల్యేను కొనుగోలు చేసి బీజేపీపాలిత మహారాష్ట్రలో ఆయనను బీజేపీయే ఉంచిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ప్రభుత్వ కూలడానికే ఒక ఎమ్మెల్యేను కిడ్నాప్ చేసిందని మండిపడుతోంది.