Begin typing your search above and press return to search.
వైఎస్ వివేకా హత్యలో క్లూ దొరికిందా.?
By: Tupaki Desk | 12 Sep 2019 5:37 AM GMTఏపీ సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకా హత్య కేసులో తీగలాగితే డొంక కదిలినట్టు సమాచారం. వైఎస్ వివేకాను హత్య చేసినప్పటి నుంచి కీలకసాక్ష్యాలు దొరకకుండా నిందితులు చెరిపివేసి హత్య ఎవరు చేశారనేది తెలియకుండా జాగ్రత్త పడ్డారు. మార్చి 15న చంద్రబాబు సర్కారు హయాంలో వైఎస్ వివేకా హత్య జరిగింది. ప్రభుత్వం మారింది. జగన్ ప్రభుత్వం కొలువుదీరింది. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్)ను జగన్ సర్కారు ఏర్పాటు చేసింది. ఇప్పటికీ ఆరు నెలలవుతున్న వైఎస్ వివేకా హత్య కేసులో చిక్కుముడి వీడకపోవడం గమనార్హం.
వైఎస్ వివేకా హత్య కేసులో సిట్ అధికారులు ఇప్పటివరకు మొత్తం 1300మందికి పైగా విచారించారు. కీలక అనుమానితులుగా భావించిన పరమేశ్వర్ రెడ్డి - చంద్రశేఖర్ రెడ్డి - వాచ్ మెన్ రంగయ్య - ఎర్ర గంగిరెడ్డిలను గుజరాత్ తీసుకెళ్లి నార్కో పరీక్షలు నిర్వహించారు. అయినా విషయం తేలలేదు. అయితే తాజాగా మరో అనుమానితుడు శ్రీనివాస్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. పోలీసుల వేధింపులే కారణమని బంధువులు ఆరోపించారు.
అయితే ఈ ఆత్మహత్యపై శూలశోధన చేసిన సిట్ అధికారులు తీగలాగితే డొంక బయటపడినట్టు సమాచారం. శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య తర్వాత పోస్టుమార్టంకు బాడీని పంపిన పోలీసులు అతడిది ఆత్మహత్య కాదని.. హత్య అని వైద్యుల నివేదికలో తేలినట్టు సమాచారం..
ఇక అతడు రాసినట్టు చెబుతున్న సూసైడ్ నోట్ కూడా అతడు రాసింది కాదని ఫోరెన్సిక్ నివేదికలో తేలిందట.. శ్రీనివాస్ రెడ్డి లెఫ్ట్ హ్యాండర్. కానీ లేఖ రాసింది రైట్ హ్యాండర్ అని.. ఈ నోట్ శ్రీనివాస్ రెడ్డి రాసింది కాదని తేలింది. దీంతో వైఎస్ వివేకా హత్యకు శ్రీనివాసరెడ్డి హత్యకు సంబంధం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు..
కరుడుగట్టిన నేరప్రవృత్తి గల శ్రీనివాసరెడ్డి కేవలం పోలీసులు విచారిస్తున్నారని సూసైడ్ చేసుకునే రకం కాదని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి మరణం గుట్టు విప్పితే వైఎస్ వివేకా హత్య కేసు చిక్కుముడి వీడిపోతుందని పోలీసులు భావిస్తున్నారు.