Begin typing your search above and press return to search.

ఫ్లాష్ న్యూస్ ..వైరస్ లో మార్పులొచ్చాయంట ?

By:  Tupaki Desk   |   21 May 2020 7:30 AM GMT
ఫ్లాష్ న్యూస్ ..వైరస్ లో మార్పులొచ్చాయంట ?
X
చైనాలో పుట్టిన ఈ మహమ్మారి అక్కడి నుండి ప్రపంచంలోని పలు దేశాలకి వ్యాప్తి చెందింది. అయితే వైరస్ పుట్టినిల్లు చైనా లో వ్యాధి తీవ్రత తగ్గిపోయింది అని అనుకున్నారు. కానీ , తగ్గినట్టే తగ్గి మళ్లీ అక్కడ పాజిటివ్ కేసులు పుంజుకుంటున్నాయి. అయితే కొత్తగా నమోదవుతున్న కేసులను చూస్తే వైరస్‌ మార్పు చెందుతుందేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి. వూహాన్ ‌లో పుట్టిన వైరస్ కు తాజాగా ఈశాన్య చైనాలో వెలుగుచూస్తున్న వైరస్‌ చాలా భిన్నంగా ఉన్నట్టు చైనా వైద్యులు గుర్తించారు.

చైనా ఉత్తర ప్రావిన్స్ ‌లోని జిలిన్‌, హీలాంగ్‌ జియాంగ్ ‌లో కొత్తగా నమోదైన కరోనా రోగుల్లో వైరస్‌ చాలాకాలం బతికి ఉందని, వారు కోలుకోవడానికి చాలాకాలం పట్టిందని ప్రతికూల న్యూక్లియర్‌ యాసిడ్‌ పరీక్షల్లో గుర్తించినట్టు ప్రముఖ వైద్యనిపుణుడు క్వి హైబో తెలిపారు. అలాగే వైరస్‌ సోకిన చాలాకాలం వరకు లక్షణాలు బయటపడడం లేదని, బాధితుడిని గుర్తించేలోపే వైరస్‌ విపరీతంగా పెరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరహా వైరస్‌ సోకిన వారిలో ఎక్కువ మంది ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారని గుర్తించినట్టు హైబో చెప్పారు.

వూహాన్‌ లో బయటపడిన వైరస్‌ కారణంగా ఎక్కువ మందికి గుండె, కిడ్నీ, పేగు సంబంధిత వ్యాధులతో బాధపడ్డారన్నారు. రష్యా నుంచి వచ్చిన వారిలోని వైరస్ లో ఈ తరహా లక్షణాలు కనిపిస్తున్నట్టు చెప్పారు. కాగా చైనాలో మళ్లీ పాజిటివ్‌ కేసుల కలకలం మొదలైంది. తాజాగా 16 మందికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఇకపోతే ప్రపంచ వ్యాప్తంగా అరకోటి మంది ఈ వ్యాధి భారిన పడ్డారు. అలాగే 329,895 మంది మరణించారు.