Begin typing your search above and press return to search.
బెంగళూరులో కొత్త రకం కరోనా వేరియంట్ .. !
By: Tupaki Desk | 27 Oct 2021 7:34 AM GMTకరోనా మహమ్మారి జోరు ఇంకా దేశంలో కొనసాగుతుంది. మొదటి వేవ్ , సెకండ్ వేవ్ అంటూ ప్రపంచాన్ని కరోనా వణికిపోయేలా చేసింది. అయితే , కరోనా మహమ్మారి రోజుకో రకం వెలుగులోకి వస్తుంది. ఇక ఇదిలా ఉంటే దేశంలో కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో కరోనావైరస్ యొక్క ఏవై.4.2 కొత్త వేరియంట్ రెండు అనుమానిత కేసులు నమోదు అయ్యయి. కరోనా కొత్త వేరియెంట్ ను గుర్తించేందుకు వీటి నమూనాలను జన్యు శ్రేణి కోసం ప్రయోగశాలకు పంపినట్లు కర్ణాటక ఆరోగ్య మంత్రి కె సుధాకర్ చెప్పారు.శాంపిల్స్ ను పరీక్షల నిమిత్తం బెంగళూరులోని నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ కు పంపినట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
కరోనా కొత్త వేరియెంట్ సోకిన బాధిత వ్యక్తులిద్దరూ బెంగళూరుకు చెందిన వారని, వారికి ఎలాంటి కరోనా లక్షణాలు లేవని కూడా వైద్యాధికారులు తెలిపారు. ఏవై.4.2 అనే కొత్త వేరియెంట్ యూకే లో వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ యొక్క డెల్టా వేరియంట్ అని డాక్టర్లు చెప్పారు. కరోనా వైరస్ కొత్త వేరియెంట్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కర్ణాటకలో ఏడు జీనోమ్ ల్యాబ్ లను ఏర్పాటు చేశామని మంత్రి సుధాకర్ చెప్పారు. కొత్త కరోనా వేరియంట్ వచ్చినప్పుడల్లా రాష్ట్రం వెంటనే నిపుణుల సలహాలను పొందవచ్చని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ తో చర్చిస్తున్నామని మంత్రి తెలిపారు.
అయితే, రెండు డోసుల కరోనా వైరస్ వ్యాక్సిన్ తీసుకున్న వారు కొత్త వైరస్ వేరియెంట్ గురించి భయపడాల్సిన అవసరం లేదని, అది వారి పై తక్కువ ప్రభావం చూపుతుందని మంత్రి సుధాకర్ తెలిపారు.ఈ కొత్త వేరియెంట్ వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకున్నందున ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ వివరించారు. ఇక దేశంలో కొత్తగా 13,451 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే, నిన్న 14,021 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనాతో 585 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,42,15,653కు చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 1,62,661గా ఉంది. కరోనా నుంచి ఇప్పటివరకు మొత్తం 3,35,97,339 మంది కోలుకున్నారు. మొత్తం 4,55,653 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. నిన్న 55,89,124 డోసుల వ్యాక్సిన్లు వేశారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 103,53,25,577 డోసుల వ్యాక్సిన్లను వినియోగించారు.