Begin typing your search above and press return to search.

కొత్త తరహా దాడులు

By:  Tupaki Desk   |   28 Jun 2021 4:00 AM GMT
కొత్త తరహా దాడులు
X
దాయాది దేశం పాకిస్ధాన్ మద్దతుతో తీవ్రవాదులు భారత్ సైన్యంపై కొత్త తరహా దాడులు మొదలుపెట్టారు. పాకిస్ధాన్ సరిహద్దుల్లో ఉన్న జమ్మూ-కాశ్మీర్ లో ఉన్న వైమానిక స్ధావరాలపై ద్రోన్లతో బాంబులు విసిరారు. భారత్ వాయుసేన స్ధావరాలపై మొదటిసారి ద్రోన్లను ఉపయోగించి తీవ్రవాదులు బాంబులతో దాడులు జరపటం సంచలనంగా మారింది. కాకపోతే తీవ్రవాదుల టార్గెట్ ఫెయిలైంది.

తీవ్రవాదులు వేసిన మొదటిబాంబు విమానాశ్రంలో పేలింది. రెండోబాంబు సైనిక స్ధావరంపైనే పడింది. అయితే రెండు పేలుళ్ళల్లోను ప్రాణనష్టం మీ జరగలేదు. అలాగే ఆయుధాలకు, యుద్ధ విమానాలకు కూడా పెద్దగా నష్టం జరగలేదు. కాకపోతే కొత్త తరహాలో ద్రోన్లతో జరిగిన దాలులు కావటంతో రాడర్లు కానీ సైన్యం కానీ పసిగట్టలేకపోయింది.

పాకిస్ధాన్ సరిహద్దులకు, దాడిజరిగిన స్ధావరాలకు మధ్యలో 14 కిలోమీటర్ల దూరముంది. ఇంతదూరం వచ్చి బాంబులు వేసిన ద్రోన్లను ఏ వ్యవస్ధ కూడా పసిగట్టలేకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. అలాగే బాంబింగ్ జరిగిన తర్వాత తిరిగి ఆ ద్రోన్లు ఎక్కడికి వెళ్ళిపోయాయో కూడా సైన్యానికి అర్ధం కావటంలేదు. ఇదే విషయమై ఇపుడు సైన్యాధికారులు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు.

ఆదివారం నాడు నిజంగా భారత్ కు చాలా అదృష్టమనే చెప్పాలి. జమ్మూ వైమానిక స్ధావరంలోని ఎంఐ 17 విమానాలు, హెలికాప్టర్లే లక్ష్యంగా ద్రోన్లతో ఉగ్రవాదుల దాడులు జరిగిందన్నది వాస్తవం. ఒకవేళ ఉగ్రదాడి గనుక టార్గెట్ ను కొట్టుంటే విమానాశ్రయంలోని హ్యాంగర్లలో ఉన్న యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు ధ్వంసం అయిపోయేవే. అప్పుడు భారత్ కు అపారనష్టం జరిగేదనే చెప్పాలి. అలాంటిది కేవలం అదృష్టం వల్లే భారీ నష్టం తృటిలో తప్పిపోయింది. మొదటిసారి ద్రోన్లతో జరిగిన దాడులు కాబట్టే వెంటనే యాంటీ ద్రోన్ సాంకేతికతపై భారత్ దృష్టిపెట్టింది.