Begin typing your search above and press return to search.

మనల్ని దెబ్బేసేలా యూకే కొత్త వీసా పాలసీ

By:  Tupaki Desk   |   24 Nov 2016 6:41 AM GMT
మనల్ని దెబ్బేసేలా యూకే కొత్త వీసా పాలసీ
X
వేర్వేరు దేశాల నుంచి బ్రిటన్ కు వచ్చే వారికి చెక్ చెప్పేందుకు వీలుగా యూకే వీసా పాలసీకి సంబంధించి సరికొత్త నిర్ణయాన్ని ఈ రోజు నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. కొత్త విధానంతో ఐటీ ఇంజనీర్లపై తీవ్ర ప్రభావం పడే వీలుందని చెబుతున్నారు. కొత్త పాలసీతో భారత ఐటీ ఉద్యోగులకు ఉపాధి అవకాశాలపై తీవ్రంగా దెబ్బ తీసేలా కొత్త పాలసీ ఉండటం గమనార్హం.

యూకే హోంశాఖ ప్రకటించిన కొత్త నిబంధనలు వలసవాదుల్ని అడ్డుకోవటం.. వారికి ఉపాధి అవకాశాలు తగ్గేలా చేయటం కనిపిస్తుంది. విదేశాల నుంచి ఉపాధి అవకాశాల కోసం వచ్చే ఉద్యోగులకు ఇచ్చే జీతాన్ని భారీగా పెంచటం ద్వారా స్వేదేశీయులకు ఉద్యోగ అవకాశాలు పెంచేలా బ్రిటన్ ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఎందుకిలా అంటే.. గతంలో కనీస వేతం 20,800 పౌండ్లు ఉండగా.. ఇప్పుడు మార్చిన కొత్త పాలసీలో కనీస వేతనం 30వేల పౌండ్లు ఉండాలి. ఒకేసారి దాదాపు 10 వేల పౌండ్లు (కచ్ఛితంగా చెప్పాలంటే 9200 పౌండ్లు) వరకూ పెంచటం విదేశీయుల అవకాశాల్ని దెబ్బ తీయటం ఖాయం.

ఐసీటీ విధానంలోజారీ చేసే వీసాల్లో 90 శాతం భారత ఉద్యోగులే దక్కించుకుంటుంటారు. మార్చిన నిబంధనతో మన ఐటీ ఇంజనీర్ల మీద తీవ్రప్రభావం పడుతుందని చెప్పొచ్చు. తాజాగా తీసుకొస్తున్న పాలసీలో వేతన పరిమితిని కేవలం టైర్ 2 ఐసీటీ విభాగానికేకాకుండా ఇతర విభాగాలకు కూడా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. టైర్ 2 ఉద్యోగులకు రూ.20.8 లక్షల వేతనం ఉండాలని చెబుతూ కొన్ని మినహాయింపులు ఇచ్చారు. ట్రైనీలుగా వచ్చే టైర్ 2 గ్రాడ్యుయేట్ ట్రైనీల వేతన పరిమితిని రూ.19.14 లక్షలుగా డిసైడ్ చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఏడాదికి ఒక కంపెనీ కేవలం 20 మంది ఉద్యోగుల్ని మాత్రమే తీసురావాలన్నఆంక్షను విధించారు. దీంతో.. మన ఐటీ ఉద్యోగుల మీద ప్రభావం పడే అవకాశం ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/