Begin typing your search above and press return to search.
100 రోజుల్లో మోడీ వద్ద అటెండెన్సు?
By: Tupaki Desk | 13 Oct 2016 7:30 PM GMT మారుతున్న అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో భారత్ కీలక దేశంగా ఎదుగుతోంది. అదేసమయంలో మన ప్రధాని నరేంద్ర మోడీ మరింత కీలకంగా వ్యవహరిస్తూ భారత్ హోదాను మరింత సుస్థిరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలో ఓ సంస్థ ఇచ్చిన నివేదిక అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రస్తుత అధ్యక్షుడు ఒబామా స్థానంలో ట్రంప్ ఎన్నికైనా.. లేదంటే హిల్లరీ ఎన్నికైనా కూడా ఎవరైనా కానీ 100 రోజుల్లో భారత ప్రధాని మోడీని కలవాల్సిందేనని.. భవిష్యత్ సంబంధాల మెరుగు కోసం చర్చలు జరపాల్సిందేనని సెంటర్ ఫర్ స్ర్టాటజీస్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ అనే అమెరికా సంస్థ తాజా నివేదికలో ప్రకటించింది.
కాగా బరాక్ ఒబామా పదవీకాలం మరో 100 రోజుల్లో ముగియనుంది. ఈలోగానే కొత్త అధ్యక్షుడి ఎన్నికా పూర్తవుతుంది. దీంతో ఇప్పటికే రెండు దేశాల మధ్య రక్షణ బంధుత్వం బలపడుతున్న ఈ రోజుల్లో కొత్త అధ్యక్షుడు - మోదీల మధ్య సాధ్యమైనంత త్వరగా సమావేశం జరగాల్సి వుందని ఆ సంస్థ అభిప్రాయపడింది.
అమెరికాలో కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం దాదాపుగా ప్రస్తుత ప్రభుత్వం మాదిరిగానే విదేశీ సంబంధాలు నెరపక తప్పదని.. భారత్ తో మైత్రి అమెరికాకు చాలా కీలకమని పేర్కొంటూనే భారత్ తో పాటు ఆస్ట్రేలియా - జపాన్ లతో సైతం కలసి పనిచేయాల్సి వుందని, పసిఫిక్ - హిందూ మహాసముద్రం ప్రాంతంలో ఈ దేశాల ప్రయోజనాలు కలగలిసి వున్నాయని పేర్కొంది. కొత్త అధ్యక్షుడు - భారత ప్రధాని తొలి 100 రోజుల్లో కలిసి చర్చలు జరిపితే - ద్వైపాక్షిక బంధం బలోపేతంపై బలమైన సంకేతాలు వెళ్తాయని ఆ సంస్థ పేర్కొంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/