Begin typing your search above and press return to search.
మహారాష్ట్రలో కొత్త వేరియంట్ ఎంట్రీ.. ఏడుగురికి పాజిటివ్
By: Tupaki Desk | 30 May 2022 2:30 AM GMTఇప్పుడిప్పుడే కరోనా కాస్త తగ్గుముఖం పట్టి ముఖానికి మాస్కులు తొలగించి ఆఫీసుల బాట పడుతున్నాం. ఇంతలోనే ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అంటూ కొవిడ్ మహమ్మారి మరో పేరుతో సరికొత్త రూపుతో మళ్లీ విజృంభించడం షురూ చేసింది. బీఐ4, బీఏ5 లతో ఒమిక్రాన్ సబ్వేరియంట్స్ మొదటి సారి దక్షిణాఫ్రికాలో నిర్ధారణ అయ్యాయి. తర్వాత అతి కొద్ది కాలంలోనే ప్రపంచ దేశాలకు ఈ ఒమిక్రాన్ వేరియంట్లు వ్యాప్తి చెందాయి. భారత్లో కూడా గత వారం తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ కేసులు నమోదయ్యాయి.
భారత్లో ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు అడుగుపెట్టాయి. ఇప్పటికే తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమై నప్పటికీ ఈ కేసులు ఇతర రాష్ట్రాలకు వ్యాపించడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మహారాష్ట్రాలో మొదటిసారిగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ4తో పాటు బీఏ5 కేసులు కలకలం రేపుతున్నాయి. తాజాగా నాలుగు బీఏ4, మూడు బీఏ5 సబ్ వేరియంట్ కేసులు గుర్తించినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఒమిక్రాన్ సబ్ వేరియంట్ కేసులు త్వరగా వ్యాప్తి చెందినా.. అంతగా భయపడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. పాజిటివ్గా నిర్ధారణ అయిన వారిలో తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని తెలిపారు.
ఈ వ్యాధి సోకిన వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌ను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నిర్వహించింది. దీనిని ఫరీదాబాద్‌లోని ఇండియన్ బయోలాజికల్ డేటా సెంటర్ ధ్రువీకరించింది. పూణె కు చెందిన ఏడుగురు రోగుల్లో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ వైరస్ సోకినట్లు ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు.
నలుగురు రోగుల్లో బీఏ 4 వేరియంట్, ముగ్గురిలో బీఏ5గా నిర్ధారణ అయిందని చెప్పారు. బాధితుల్లో నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నట్లు వెల్లడించారు. వీరిలో నలుగురు బాధితులు 50 ఏళ్లు పైబడిన వారు కాగా ఇద్దరు 20-40 ఏళ్ల మధ్య ఉన్నవారు.. ఒక బాధిత చిన్నారికి తొమ్మిదేళ్లు అని చెప్పారు.
కొత్త వేరియంట్ సోకిన వారిలో ఆరుగురు కరోనా టీకా రెండు డోసులు తీసుకున్నారని మహారాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు. వారిలో ఒకరు బూస్టర్ షాట్ కూడా తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే వైరస్ సోకిన చిన్నారి మాత్రం ఎలాంటి టీకా తీసుకోలేదని చెప్పారు. వారందరికీ కరోనా స్వల్ప లక్షణాలు ఉన్నాయని.. వారిని ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మే 4 నుంచి 18వ తేదీ మధ్య వీరి శాంపిళ్లను సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపినట్లు తెలిపారు. బాధితుల్లో ఇద్దరు దక్షిణాఫ్రికా, బెల్జియంకు వెళ్లగా.. ముగ్గురు కేరళ,కర్ణాటకలకు ప్రయాణించారు. మిగిలిన వారు ఎక్కడికి ప్రయాణించ లేదని వెల్లడించారు.
కరోనా మొదటి, రెండో దశల్లో మహారాష్ట్ర అట్టుడికిపోయింది. దేశమంతా లాక్డౌన్ త్వరగానే సడలించినా.. మహారాష్ట్రలో మాత్రం కేసులు తగ్గకపోవడంతో చివరగా లాక్డౌన్ సడలించారు. ఇటీవలే అక్కడి హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్లిక్ ప్రాంతాలు, సినిమా థియేటర్లు ఓపెన్ చేశారు. అంతలోనే మళ్లీ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ కేసులు ఒకేసారి ఏడు నమోదు కావడం కాస్త ఆందోళన కలిగిస్తోన్న విషయం. ఒమిక్రాన్ వేరియంట్ల తో ముప్పు ఏం లేకపోయినా.. ఈ వైరస్లు అతి వేగంగా వ్యాప్తి చెందుతుండటం వల్ల మళ్లీ మహారాష్ట్ర ఆంక్షల మధ్య వెళ్లి పోతుందేమోనని రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అలాంటిదేం లేదని అందరూ మాస్కులు ధరిస్తూ.. కరోనా నిబంధనలు పాటిస్తే అలాంటి పరిస్థితి రాదని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ చెబుతోంది.