Begin typing your search above and press return to search.
స్వలింగ సంపర్కుల్లోనే ఈ వైరస్ కేసులు!
By: Tupaki Desk | 8 July 2022 3:20 AM GMTప్రపంచ దేశాలను చుట్టేస్తోంది. అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్ అప్పుడే 59 దేశాలకు పాకిందని స్విట్జర్లాండ్ లోని జెనీవాలో ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (వరల్డ్ హె ల్త్ ఆర్గనైజేషన్) హెచ్చరించింది. అందులోనూ గత వారం రోజుల్లోనే 66 శాతం పెరుగుదల కనిపించిందని వెల్లడించింది.
మరోవైపు స్వలింగ సంపర్కుల్లోనే మంకీ పాక్స్ కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ బాంబు పేల్చింది. దీంతో అందరిలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. స్వలింగ సంపర్కుల్లో పోలిస్తే ఇతరుల్లో మంకీ పాక్స్ కేసులు తక్కువేనని చెబుతున్నారు. కాగా ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 80 శాతం కేవలం యూరప్ దేశాల్లోనే బయటపడ్డాయి.
కాగా 59 దేశాల్లో 6,027 మందికి మంకీ పాక్స్ నిర్ధారణ అయ్యిందని.. ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. గత వారంలోనే 2,614 కేసులు బయటపడ్డాయని వెల్లడించింది. తాజాగా మరో ఇద్దరు మరణించడంతో మరణాల సంఖ్య మూడుకు చేరిందని తెలిపింది. వీరంతా ఆఫ్రికా దేశాలకు చెందినవారేనని పేర్కొంది. మంకీపాక్స్ కేసులు ఎక్కువగా యూరప్, ఆఫ్రికాలోనే నమోదవుతున్నాయని వివరించింది.
మంకీ పాక్స్ వైరస్ వేగంగా వ్యాప్తి చెందడం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ గేబ్రియేసస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యాధి ప్రాబల్యంపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూనే ఉన్నామని.. జులై మూడో వారంలో డబ్ల్యూహెచ్‌ఓ నిపుణుల బృందంతో మరోసారి సమావేశమవుతానని టెడ్రోస్ పేర్కొన్నారు.
ఈ వైరస్ సోకిన వ్యక్తి చర్మం మీద దద్దుర్లు పుట్టుకొస్తాయి. సాధారణంగా ఈ దద్దుర్లు ముఖంపై మొదలై శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తాయి. ఎక్కువగా అరి చేతులు, పాదాలు, అరికాళ్లపై వస్తాయి. అవి పొక్కులుగా బొబ్బలుగా మారతాయి.
ఆ తర్వాత వాటిమీద చెక్కులు కడతాయి. చివరికి ఆ చెక్కులు రాలిపోతాయి. ప్రారంభంలో జ్వరం, తలనొప్పి, వాపులు, వెన్నునొప్పి, కండరాల్లో నొప్పి ఉంటుంది. మంకీ పాక్స్ కూడా చికెన్ పాక్స్ లాంటిదే. ఈ ఇన్ఫెక్షన్ సోకిన వారిలో కొందరి ఆరోగ్య పరిస్థితి మాత్రమే విషమిస్తుంది.