Begin typing your search above and press return to search.
తెలంగాణలో కరోనా మృతులంతా మర్కజ్ వెళ్లొచ్చిన వారే !
By: Tupaki Desk | 4 April 2020 7:50 AM GMTదేశంలో కరోనా వైరస్ ను అరికట్టడానికి కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా కరోనా భాదితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. కరోనా కేసులు ఒక్కసారిగా ఊహించని విదంగా పెరిగిపోవడానికి ముఖ్య కారణం ... ఢిల్లీ మర్కజ్ మత ప్రార్థనలే. గత వారం వరకు పరిస్థితి సాధారణంగానే ఉన్నా.. మర్కజ్‌కు హాజరైన వారికి కరోనా వైరస్ సోకడంతో వాతావరణం ఒక్కసారిగా మారింది. ముఖ్యంగా దేశ వ్యాప్తంగా గడిచిన నాలుగురోజుల్లో సంభవించిన మరణాల్లో ఢిల్లీ మర్కజ్ కు వెళ్లివచ్చిన వారే అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
ముఖ్యంగా తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన 11 మరణాల్లో ఇద్దరు మినహా మిగతావారంతా అక్కడికి వెళ్లివచ్చిన వారే. ఇక దేశ వ్యాప్తంగా నమోదవుతున్న మరణాల్లోనూ మర్కజ్ వెళ్లి వచ్చిన వారి సంఖ్యే ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇకపోతే, తెలంగాణలో తాజాగా నమోదైన కేసులన్నీ ఢిల్లీ నుంచి వచ్చిన వారు - వారితో కాంటాక్ట్ అయిన వారే అత్యధికంగా ఉన్నారు. తాజాగా ఆదిలాబాద్ - నిజామాబాద్ లో శనివారం కొత్తగా వెలుగుచూసిన కరోనా పాజిటివ్ కేసుల కూడా ఢిల్లీ బాధితులే. ఇక ఆంధ్రప్రదేశ్ లో శుక్రవారం మరణించిన కరోనా బాధితుడు కూడా ఢిల్లీ వచ్చిన వారే కావడం గమనార్హం.
రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల్లో ఎక్కువ భాగం మర్కజ్ నుంచి వచ్చిన వారే ఉన్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు మరింత అప్రమత్తం అయ్యాయి. ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారందరిని ఇప్పటికే క్వారంటైన్ చేసారు. ఇక తెలంగాణ లో ఢిల్లీ మర్కజ్ కు వెళ్లొచ్చిన వారు 1,030 మంది ఉన్నారని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వారిలో దాదాపు 900 మందిని ఇప్పటివరకు గుర్తించి తమ అధీనంలోకి తీసుకున్నారు. వారి కుటుంబ సభ్యులను - వారితో కాంటాక్ట్ అయినవారిని కూడా కొందరిని గుర్తించారు. బుధవారం 300 మందికి పరీక్షలు నిర్వహించగా - 30 మందికి పాజిటివ్ గా తేలింది. శుక్రవారం పరీక్షల్లో 75 మందికి పాజిటివ్ గా తేలింది. దీంతో మొత్తం కరోనా భాదితుల సంఖ్య 229 కి చేరింది.