Begin typing your search above and press return to search.
బ్రేకింగ్: ఏపీలో మరో 21మందికి..తెలంగాణ లో మరో 30 కరోనా కేసులు
By: Tupaki Desk | 2 April 2020 7:31 AM GMTఏపీలో రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య అమాంతం పెరుగుతోంది. ఇబ్బడిముబ్బడిగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. తెలంగాణను మించి పోయేలా ఏపీలో పరిస్థితి ఉంది.
బుధవారం రాత్రి 7 గంటల తర్వాత ఏకంగా ఏపీలో 24 కొత్త పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇవాళ గురువారం మరో 21 కొత్త కేసులు నమోదైనట్టు బులిటెన్ విడుదల చేసింది.
తాజాగా నమోదైన 21 కొత్త కేసులో మొత్తం ఏపీలో కరోనా సోకిన వారి సంఖ్య ఏకంగా 132కు చేరింది. గడిచిన 24 గంటల్లోనే 90కి పైగా కేసులు నమోదు కావడంతో ఏపీలో కరోనా కల్లోలం చోటుచేసుకుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా భయాందోళన నెలకొంది.
ఈరోజు నమోదైన కేసులతో తెలంగాణ కంటే ఏపీలోనే కరోనా బాధితుల సంఖ్య ఎక్కువైంది. తెలంగాణను ఏపీ దాటేయడం కలకలం రేపుతోంది.
మొత్తం ఏపీ వ్యాప్తంగా నెల్లూరు జిల్లాలోనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. ఇంకా 493 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. దీంతో ఖచ్చితంగా తెలంగాణను దాటి కరోనా కేసల్లో ఏపీ రికార్డు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఏప్రిల్ 2వ తేదీ వరకు ఏకంగా 132 పాజిటివ్ కేసులు నమోదు కావడం రాష్ట్రాన్ని భయం గుప్పిట్లోకి నెట్టేసింది. వరుసగా కేసులు నమోదవుతుండడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. గుంటూరు - నెల్లూరు జిల్లాల్లోనే అత్యధిక కేసులు నమోదు కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఇక తెలంగాణలో
తెలంగాణలో బుధవారం ఒక్కరోజే 30పాజిటివ్ కేసులు నమోదుకాగా ముగ్గురు కరోనాతో మృతిచెందారు. దీంతో తెలంగాణలో కరోనా మృతుల సంఖ్య తొమ్మిదికి పెరిగింది. కరోనా పాజిటివ్ కేసులు 127కు చేరుకుందని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో వెల్లడించారు. ఢిల్లీ మర్కజ్ కు కరోనా లింకు ఉండటంతో దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తుంది. దీంతో తెలంగాణ నుంచి ఢిల్లీ మర్కజ్ వెళ్లిన వారి వివరాలను సేకరించి వారిని కరోనా ఆసుపత్రులకు తరలిస్తున్నారు. మర్కజ్ వెళ్లొచ్చిన వారిలో 500మందికి పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది.వీరిలో 30మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. మిగతా వారిని ఐసోలేషన్ వార్డులకు తరలించినట్లు సమాచారం. ఢిల్లీకి వెళ్లొచ్చిన 1030మందిలో 160మంది వివరాలను ఇంకా తెలియాల్సి ఉంది. వీరి నుంచి దాదాపు 2వేల మంది వరకు కరోనా వ్యాపించి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నారు.