Begin typing your search above and press return to search.
కరోనా స్పీడ్ తగ్గలేదు..ఏపీలో 190 - తెలంగాణలో 272 కేసులు
By: Tupaki Desk | 4 April 2020 4:19 PM GMTప్రాణాంతక వైరస్ గా మారిన కరోనా మహమ్మారి విజృంభణ విశ్వవ్యాప్తంగా మరింత జోరందుకుందనే చెప్పాలి. ఇప్పటికే కరోనా కట్టడికి లాక్ డౌన్ లు ప్రకటించిన మెజారీ దేశాలు... ఆశించిన మేర ఫలితాలను సాధించడంలో చతికిలబడుతున్నాయి. ఈ విషయంలో భారత్ మినహాయింపేమీ కాదనే చెప్పాలి. ఎందుకంటే... పది రోజులకు పైగా దేశం యావత్తు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయినా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందే తప్పించి తగ్గడం లేదు. శనివారం సాయంత్రానికి దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 వేలను దాటిపోయింది. అదే సమయంలో మరణాల సంఖ్య కూడా 75 మార్కును టచ్ చేసింది.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే... తొలుత కరోనా కేసుల సంఖ్యలో చాలా స్లోగానే కనిపించిన ఏపీలో ఇప్పుడు తబ్లీగీ జమాత్ కు వెళ్లివచ్చిన కారణంగా కేసుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. శనివారం సాయంత్రానికి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 190కి చేరింది. శనివారం ఒక్కరోజే 26 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 190కి చేరింది. ఇదిలా ఉంటే... రాష్ట్రంలో కరోనా కారణంగా రెండో మరణం కూడా చోటుచేసుకుంది. అనంతపురం జిల్లాలో కరోనా సోకిన ఓ వ్యక్తి శనివారం మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య రెండుకు చేరింది.
ఇక తెలంగాణ విషయానికి వస్తే... శుక్రవారం మాదిరే శనివారం కూడా కొత్తగా నమోదైన కేసులు భారీగానే ఉన్నాయి. శనివారం ఒక్కరోజే... రాష్ట్రంలో కొత్తగా 43 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 272కు చేరింది. వెరసి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ట్రిబుల్ సెంచరీకి చేరువైందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే... భారత్ లో శనివారం ఒక్కరోజే 525 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం మొత్తం మీద శనివారం సాయంత్రం నాటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3072కు చేరింది. మొత్తంగా దేశంలో ఈ కేసుల సంఖ్య శనివారం మూడు వేల మార్కును దాటేసిందన్న మాట.