Begin typing your search above and press return to search.

కరోనా వైరస్ పై మరో బ్రేకింగ్ న్యూస్

By:  Tupaki Desk   |   29 March 2020 7:30 AM GMT
కరోనా వైరస్ పై మరో బ్రేకింగ్ న్యూస్
X
కరోనా వైరస్ పై మరో బ్రేకింగ్ న్యూస్ బయటపడింది. చైనాలోని వూహాన్ లో పుట్టిన ఈ వైరస్ మళ్లీ బయటపడుతోంది. వూహాన్ లో మూడు నెలలుగా కరోనా చికిత్సలో కోలుకున్న రోగుల్లో 3 నుంచి 10శాతం మందికి తాజాగా కరోనా వైరస్ పరీక్షలు చేయగా పాజిటివ్ రావడం కలకలం రేపింది. దీన్ని బట్టి కరోనా అంత ఈజీగా తగ్గే జబ్బు కాదని తెలిసింది. ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితులను తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది.

దీన్ని బట్టి చైనా కరోనా వైరస్ బాధితుల మరణాలను తక్కువగా ప్రపంచానికి చూపిస్తోందని ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్నాయి. మళ్లీ పరీక్షలు జరుపుతున్న చైనా అధికారులకు వైరస్ తగ్గిన వారిలో తిరిగి కరోనా బయటపడడంతో తలపట్టుకుంటున్నారు. ఈ మహమ్మారి ప్రపంచానికి పెద్ద ముప్పుగా పరిగణించడం ఖాయమన్న భయం, ఆందోళన ఇప్పుడు మొదలైంది.

చైనాలో పుట్టిన కరోనా వైరస్ కు అక్కడ 82వేల మందికి పైగా సోకింది. దాదాపు 3500 మంది మరణించారు. అయితే కరోనా ఇటలీకి పాకి అక్కడ 93వేల మందికి సోకి 10వేల మంది ప్రాణాలు తీసింది. యూరప్ - అమెరికాకు పాకి మరణ మృదంగం వినిపిస్తోంది. ఇప్పుడు ఆయా దేశాల్లో కరోనా నుంచి కోలుకున్న వారు కూడా హడలి చస్తున్నారు. కరోనా తిరగబడుతున్న తీరుతో ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 6 లక్షలకు పైగా మందికి కరోనా సోకింది. ఇందులో 1,31,000 మందికి పైగా వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో వీరందరిలోనూ మళ్లీ కరోనా భయం ఆవహించింది.