Begin typing your search above and press return to search.
చైనాలో అసలు ఏంటి ఈ కొత్త వైరస్? ఎంత ప్రమాదం
By: Tupaki Desk | 7 July 2020 3:00 PM GMTఇప్పటికే మహమ్మారి వైరస్ వ్యాప్తికి జన్మనిచ్చిన చైనా ఇప్పుడు మరో వ్యాధికి పురుడు పోసుకుంది. ఉన్న వైరస్‌తోనే ప్రపంచ వణుకుతుంటే ఇప్పుడు కొత్తగా వచ్చే వ్యాధితో ప్రజలతో పాటు ప్రపంచ దేశాలు భయాందోళన వ్యక్తం చేస్తున్నాయి. అసలు ఆ కొత్త వైరస్ ఏంటి? ఎలా సోకుతుంది? అది ఎంత ప్రమాదం? అనే చర్చ ఆసక్తికరంగా మారింది. ఆ వ్యాధి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజలు శోధిస్తున్నారు. డ్రాగన్ దేశంలో వైరస్ జీ 4 పుట్టుకొచ్చింది. తాజాగా జూన్ 5వ తేదీన చైనా వైద్య అధికారులు మూడో భయంకరమైన వ్యాధి బుబోనిక్ ప్లేగు గురించి హెచ్చరికలు జారీ చేశారు. జులై 1వ తేదీ పశ్చిమ మంగోలియాలోని ఖోఫ్ట్ ప్రావిన్స్ లోని రెండు న్యూస్ ఛానెల్స్ బుబోనిక్ ప్లేగు కేసులను గురించి సమాచారమిచ్చాయి. ఈ వ్యాధి పెద్ద ఉడతల మాంసం నుంచి వచ్చినట్లు భావిస్తున్నారు.
బుబోనిక్ ప్లేగు ఏమిటంటే యెర్సినీయా పెస్టిస్ అనే బ్యాక్టీరియా వల్ల కలిగే మూడు రకాల ప్లేగులలో బుబోనిక్ ప్లేగు ఒకటి. ఈ వ్యాధి గతంలోనే ఉంది. 2010- 2015 మధ్య బుబోనిక్ ప్లేగు కేసులు 3248 నమోదయ్యాయి. దీని ఫలితంగా 584 మంది మరణించారని గణాంకాలు చెబుతున్నాయి. 50 మిలియన్ల మంది.. 14వ శతాబ్దంలో ఆసియా, యూరప్.. ఆఫ్రికా దేశాల్లో సుమారు 50 మిలియన్ల మంది ఈ బుబోనిక్ ప్లేగు వ్యాధితో మరణించినట్లు తెలిసింది. 6వ శతాబ్దంలో తూర్పు రోమన్ సామ్రాజ్యంలో జస్టినియన్ ప్లేగుకు కారణమైంది. ఈ అంటు వ్యాధి 1855లో యునాన్ ప్రావిన్స్ లో ఉద్భవించింది. ప్రధానంగా మూడు రకాలు.. బుబోనిక్, సెప్టిసిమిక్.. న్యూమోనిక్.
శరీరంలోని ఏ భాగాన్నయినా ఇది ప్రభావితం చేస్తుంది. బుబోనిక్ ప్లేగు ఎక్కువగా మెడలో లేదా గజ్జల్లో వస్తుంది. దీనివల్ల చాలా వాపు.. బాధకరమైన కణుతులు వచ్చే అవకాశం ఉంది. రోగ నిరోధక వ్యవస్థకు.. ఇది రోగ నిరోధక వ్యవస్థలో భాగమైన శోషరస వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. దీంతో ఇది మంటను కలిగిస్తుంది. శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. దీనికి యాంటీ బయోటిక్స్ తో చికిత్స చేయకపోతే బుబోనిక్ ప్లేగు ప్రాణాంతకంగా మారుతుంది.
యెర్సినియా పెస్టిస్ అనే బ్యాక్టిరీయా వల్ల కలిగే బ్యాక్టీరియా సంక్రమణ. ఇది ఎలుకల వల్ల కూడా వస్తుందని తెలిసింది. ‘ర్యాట్ఫ్ ఫ్లీ' అని మరో పేరు కూడా ఉంది. ఎలుకలు పరాన్న జీవులు. ఇవి కొత్త బ్యాక్టీరియాను ఉత్పత్తి చేయగలవు. ఎవరితో మనకు నేరుగా సంబంధాలు కలిగి ఉంటామో వారికి వెంటనే ఈ వ్యాధి సోకుతుంది. ఇది సోకిన ఈగలతో సంపర్కం ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి సోకిన జంతువు లేదా వ్యక్తితో ప్రత్యక్ష సంబంధం.. ఇది సోకిన జంతువును తింటే బుబోనిక్ ప్లేగు రావచ్చు.
లక్షణాలు
బుబోనిక్ ప్లేగు లక్షణాలు ఇవి. జ్వరం, చలి, తలనొప్పి, ఒంటిపై వాపులు, శరీరంపై పుండ్లు, లింప్ గ్రంధుల్లో నొప్పి వస్తాయి. కొన్ని రోజులు బ్యాక్టీరియాకు గురైన తర్వాత అకస్మాత్తుగా కనిపిస్తాయి. కండరాల తిమ్మిర.. మూర్ఛ..చలి.. అధిక జ్వరం.. వాపు కనిపించే ముందు ఈ ప్రాంతంలో నొప్పి వస్తుంది.
తలనొప్పి.. కాలి, వేళ్లు, పెదవులు.. ముక్కు కొన యొక్క గ్యాంగ్రేన్ (రక్త సరఫరా లేకపోవడంతో కణజాల మరణం).
బుబోనిక్ ప్లేగును ప్రయోగశాలల్లో నిర్ధారిస్తారు. సంక్రమణ ప్రారంభ.. చివరి దశలలో తీసుకున్న శ్యాంపిల్స్ ను పరిశీలించి వీటిని నిర్ధారిస్తారు. చాలా మందికి ఈ బుబోనిక్ ప్లేగు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. అయితే కొన్ని కారణాల వల్ల వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. అవేంటంటే జంతువులతో కలిసి ఉండడం.. ఆరు బయట హైకింగ్, క్యాంపింగ్ లేదా వేటలో గడపడం.. ఎలుక, ఉడత.. కుందేలు వంటి వాటికి బుబోనిక్ ప్లేగు సోకిన ఒక సజీవంగా ఉన్న జంతువును లేదా చనిపోయిన వాటిని తాకితే వ్యాపిస్తుంది. ప్లేగు వ్యాధి ఉన్న వారితో సంప్రదిస్తే.. ఈ వ్యాధికి గల చికిత్స.. ఈ ప్లేగును నయం చేయడానికి మందు అందుబాటులో ఉంది. అయితే సకాలంలో చికిత్స అందితేనే ఇది తగ్గే అవకాశం ఉంది.
సిప్రోఫ్లోక్సాసిన్, డాక్సీసైక్లిన్ వంటి యాంటీ బయాటిక్స్ ఈ వ్యాధి చికిత్సలో ప్రభావవంతంగా పని చేస్తాయి. యాంటీ బయాటిక్స్ తో చాలా మంది ప్రజలు ఒకటి లేదా రెండు వారాల్లోనే మెరుగవుతారు. ప్రస్తుతానికి బుబోనిక్ ప్లేగుకు వ్యాక్సిన్ అందుబాటులో లేదు. కాబట్టి వ్యాధి బారిన పడకుండా ఉండటానికి నివారణ చర్యలు తీసుకోవాలి.
నివారణ చర్యలు
- ఈ వ్యాధి సోకిన జంతువులను తాకేటప్పుడు చేతికి గ్లౌవ్స్ తొడుక్కోండి.
- ఎలుకలు.. ఉడతలు రాకుండా మీ ఇంటి చుట్టుపక్కల ఉండే రంధ్రాలను మూసేయ్యండి.
- పెంపుడు జంతువులపై ఫ్లూ కంట్రోల్ స్ప్రేలు లేదా ఇతర చికిత్సలను చేయించండి.
- పెంపుడు జంతువు ఆరుబయట ఉంటే, వాటిని మీ మంచం మీద పడుకోనివ్వదు.