Begin typing your search above and press return to search.

కేరళను వణికిస్తున్న కొత్త వైరస్... వాట్ నెక్ట్స్

By:  Tupaki Desk   |   10 July 2021 10:30 AM GMT
కేరళను వణికిస్తున్న కొత్త వైరస్... వాట్ నెక్ట్స్
X
ఒకవైపు కరోనా వైరస్ తో అల్లాడిపోతున్న కేరళను కొత్త సమస్య వణికించేస్తోంది. అదే కొత్తగా బయటపడిన జికా వైరస్. దేశం మొత్తంమీద జికా వైరస్ బయటపడిన మొదటి రాష్ట్రం కేరళనే. విచిత్రమేమిటంటే కరోనా వైరస్ కేసు కూడా మొట్టమొదట బయటపడింది కేరళలోనే కావటం. కేరళలో కరోనా రోగుల సంఖ్య తగ్గినట్లే తగ్గి మళ్ళీ గడచిన రెండు వారాలుగా పెరిగిపోతోంది. దీన్ని అదుపుచేయటానికే ప్రభుత్వం నానా అవస్తలు పడుతుంటే హఠాత్తుగా జికా వైరస్ తాజాగా బయటపడింది.

మొదటగా వైరస్ ఓ గర్భిణిలో బయటపడింది. గర్భిణిలోని లక్షణాలను బట్టి జికా వైరస్ సోకినట్లు నిర్ధారించారు. ఇదే సమయంలో మరో 19 మందిలో కూడా ఇలాంటి లక్షణాలే బయటపడటంతో వాళ్ళ రక్తనమూనాలను కూడా పూణేలోని వైరాలజీ ల్యాబ్ కు పంపారు. 19 మందిలో 13 మందికి కూడా జికా వైరస్ సోకినట్లు ల్యాబ్ నిర్ధారించింది. దీంతో ప్రభుత్వంలో టెన్షన్ పెరిగిపోతోంది. ఒకవైపు కరోనా మరోవైపు తాజాగా బయటపడిన జికా వైరస్ తో కేరళ జనాలు భయపడిపోతున్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కరోనా వైరస్ కు లాగే జికా వైరస్ కు కూడా చికిత్స, మందులు లేకపోవటం. రెండింటికీ వైరస్ సోకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవటమే చేయగలిగింది. ఇదే విషయాన్ని జనాలకు కేరళ ప్రభుత్వం చెబుతోంది. కేరళ ప్రభుత్వానికి సాయం చేయటానికి కేంద్రం ఐదుగురు నిపుణులను కేంద్రం మలబారుకు పంపింది. ఇదే సమయంలో రాష్ట్రంలోని వైద్య సిబ్బంది మొత్తానికి రక్తపరీక్షలు చేయించాలని ప్రభుత్వం అనుకుంటోంది. ఎందుకంటే వైరాలజీ ల్యాబ్ నిర్ధారించిన 13 మంది జికా వైరస్ రోగులు వైద్య సిబ్బందే కాబట్టి.

అంటే కరోనా వైరస్ నియంత్రణలో తిరుగుతున్న వైద్య సిబ్బందికి ఎక్కడో జికా వైస్ తగులుకుంది. 19 మందిని పరీక్షిస్తే 13 మందిలో జికా వైరస్ బయటపడిందంటే మామూలు విషయం కాదు. వేలాదిమంది వైద్య సిబ్బంది క్షేత్రస్ధాయిలో పనిచేస్తున్నారు. మరి అందరినీ పరీక్షిస్తే కానీ అసలు విషయం బయటపడదు.