Begin typing your search above and press return to search.

కరోనా ఫ్రీగా పత్రికలు.. శానిటైజర్ లతో క్లీన్

By:  Tupaki Desk   |   29 March 2020 12:00 PM GMT
కరోనా ఫ్రీగా పత్రికలు.. శానిటైజర్ లతో క్లీన్
X
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలంటే ఇదే.. దినపత్రికలతో కరోనా వ్యాపిస్తుందని ప్రజల్లో - సోషల్ మీడియాలో విష ప్రచారం జరగడంతో వాటిని ఎవరూ వేయించుకోని పరిస్థితి ఏర్పడింది. నిపుణులు - ప్రభుత్వాలు - మీడియా చెప్పాక ఇప్పుడు కాస్త పత్రికలను పట్టుకుంటున్నారు. వార్తపత్రికలతో కరోనా వైరస్ వ్యాపించదని నిపుణులు - వైద్యులు స్పష్టం చేస్తున్నారు. కేంద్రం కూడా పత్రికలు ప్రజల్లోకి వెళ్లాలని ప్రచారం మానుకోవాలని సూచించింది.

దీంతో తెలుగు పత్రికలు ఇప్పుడు తమ పత్రికలను శానిటైజ్ చేస్తున్నాయి. ప్రజల ఆందోళనలు అర్థం చేసుకొని ముద్రణ ప్రక్రియలో జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

తాజాగా పత్రికలు బయటకు వచ్చే ముద్రణ యంత్రాల వద్ద శానిటైజర్ల స్ప్రేతో పత్రికలను వైరస్ రహితంగా మారుస్తున్నారు. వీటిని ప్యాక్ చేసి వినియోగదారులకు అందిస్తున్నారు. ఆ వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

నిజానికి పత్రికల ముద్రణకు వాడే సిరా - ప్రింటింగ్ జరిగే పద్ధతి ద్వారా పత్రికల ఉపరితలంపై వైరస్ ఉండే అవకాశాలు స్వల్పమని బీబీసీ పరిశోధనలో తేలింది. వైరస్ ఉండే వ్యక్తి పత్రికను పట్టుకున్నా పేపర్ పై కరోనా వైరస్ కాగితం పైకి సోకదని.. వార్త పత్రికల రవాణా ద్వారా కూడా సోకదని నిపుణులు సూచిస్తున్నారు.

సో ఇంత జాగ్రత్తలు తీసుకుంటున్న పత్రికల యాజమాన్యాలు - చర్యలు చూశాకైనా పత్రికలతో కరోనా వ్యాపిస్తుందన్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టండి. అందరూ పత్రికలు చదవండి..