Begin typing your search above and press return to search.

స్మార్ట్ ఫోన్లో, కంప్యూటర్లో కొత్త ‘వైరస్’.. లక్షలు ఊడ్చేస్తుంది!

By:  Tupaki Desk   |   30 April 2021 12:30 AM GMT
స్మార్ట్ ఫోన్లో, కంప్యూటర్లో కొత్త ‘వైరస్’.. లక్షలు ఊడ్చేస్తుంది!
X
స్మార్ట్ విప్లవం వచ్చిన తర్వాత.. దాదాపు ప్రతీ ఇంట్లో ఒకటికన్నా ఎక్కువగా స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. కంప్యూటర్లు ఉండే ఇళ్ల సంఖ్య కూడా పెరిగింది. అయితే.. వీటిని అవ‌స‌రానికి ఎంత మంది ఉప‌యోగిస్తున్నారు? అస‌లు.. అవ‌స‌రం కోస‌మే వీటిని కొనుగోలు చేస్తున్నారా? అనే ప్ర‌శ్న‌ల‌కు ఆన్స‌ర్ చెప్ప‌డం క‌ష్ట‌మేమీ కాదు. స్మార్ట్ ఫోన్ హోదాకు సింబ‌ల్ గా మారిపోవ‌డంతో.. ప్ర‌తీ ఒక్క‌రూ ‘స్మార్ట్’గా మారిపోతున్నారు.

స్మార్ట్ కావడం తప్పు కాదు.. కానీ, దాన్ని సరిగా యూజ్ చేయడం తెలియకపోతే.. సైబర్ నేరగాళ్లు ఇంకా స్మార్ట్ గా దోచేస్తారు! త‌ర‌చూ ఎక్క‌డో ఓ చోట ఇలాంటి దోపిడీలు జ‌రుగుతూనే ఉన్నాయి. సిగ్గుతో కొంద‌రు బ‌య‌ట‌కు రాకుండా ఉండిపోతుండ‌గా.. మ‌రికొంద‌రు మాత్రం మోస‌గాళ్ల‌ టార్చ‌ర్ భ‌రించ‌లేక పోలీసు స్టేష‌న్ మెట్లు ఎక్కుతున్నారు. ప్ర‌ధానంగా.. ఆన్ లైన్లో సంచ‌రించే వారు ఎక్కువ‌గా ఈ మోసాల‌కు గుర‌వుతున్నారు. హైద‌రాబాద్ లో తాజాగా రెండు ఘ‌ట‌న‌లు ఇలాంటివి వెలుగు చూశాయి.

ఓ వ్య‌క్తికి పోర్న్ వెబ్ సైట్ నుంచి వ‌చ్చిన లింక్ ను ఓపెన్ చేశాడు. ఒక్కసారి రిజిస్ట్రేష‌న్ చేసుకుంటే.. అన్నీ ఫ్రీ అని చెప్పిందో హాట్ బ్యూటీ. ఇంకేముందీ.. మ‌నోడు వెంట‌నే ప‌ని పూర్తిచేశాడు. ఆ త‌ర్వాత రెచ్చ‌గొట్టే మాట‌ల‌తో ఇత‌గాడిని చిత్తు చేయ‌డం మొద‌లు పెట్టింది. ఆ మ‌త్తులో చెప్పింద‌ల్లా చేసుకుంటూ పోయాడు. ఆ త‌ర్వాత వీడియో కాల్ చేసింది ఆ కిలేడీ. బ‌ట్ట‌లు మొత్తం విప్పేసి మాట్లాడ్డం మొద‌లు పెట్టింది. ఇత‌గాడిని కూడా విప్ప‌మ‌ని చెప్పింది. ఆ కైపులో విప్పేశాడు కూడా. ఆ త‌ర్వాత కాసేప‌టికే ఓ ఫోన్ వ‌చ్చింది.

నువ్వు బ‌ట్టలు విప్పిందంతా.. రికార్డు చేశాం. ఇది ఎవ‌రికీ చూపించొద్దంటే.. రూ.20 వేలు పంపాల‌న్నారు. ప‌రువు పోతుందేమోన‌ని భ‌య‌పడి, పంపేశాడు. ఆ త‌ర్వాత మ‌రోసారి ఫోన్ చేసి.. మ‌ళ్లీ డ‌బ్బులు అడిగారు. ఇలా.. మొత్తం 2 ల‌క్ష‌లు కాజేశారు. అయినా.. ఆగ‌క‌పోవ‌డంతో త‌ట్టుకోలేక పోలీస్ స్టేష‌న్ కు వెళ్లాడు.

మ‌రో ఘ‌ట‌న‌లో కూడా ఇదే విధంగా జ‌రిగింది. ఇలాంటి త‌ర‌చూ వెలుగు చూస్తూనే ఉన్నాయి. కొంద‌రు అమాయ‌కులు ప‌రువు పోతుంద‌ని, ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. కేవ‌లం అవ‌గాహ‌న లోపంతోనే ఇలా నిలువు దోపిడీకి గుర‌వుతున్నారు. గుర్తు తెలియ‌ని ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయొద్ద‌ని, తెలియ‌ని మెసేజ్ ల‌లో వ‌చ్చే లింక్స్ పై క్లిక్ చేయొద్ద‌ని పోలీసులు, అధికారులు గొంతుపోయేలా మొత్తుకుంటున్నారు అయినాగానీ.. జ‌నం విన‌ట్లేదు. మొత్తం క్ష‌వ‌రం అయిన త‌ర్వాత అప్పుడు పోలీసు త‌లుపు త‌డుతున్నారు.