Begin typing your search above and press return to search.
కేరళలో కొత్త వైరస్ కలకలం ... 13 మందికి ‘నోరో' వైరస్ !
By: Tupaki Desk | 13 Nov 2021 6:57 AM GMTకరోనా మహమ్మారి జోరు ఇంకా కొనసాగుతున్న సమయంలో కేరళ ఇప్పటికే అల్లకల్లోలంగా ఉంది. ఇదే నేపథ్యంలో కొత్తగా మరో వైరస్ బయటపడటం కలకలం రేగుతోంది. కేరళ లో అరుదైన నోరో వైరస్ కేసులు నిర్ధారణయ్యాయి. వయనాడ్ జిల్లా పోకోడ్‌లోని ఓ వెటర్నరీ కాలేజీకి చెందిన 13 మంది విద్యార్థులు నోరో వైరస్ బారిన పడ్డారు.
కాలేజీ బయట, హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థుల్లో తొలుత ఈ వైరస్ నిర్ధారణ అయినట్టు అధికారులు తెలిపారు. విద్యార్థుల రక్త నమూనాలను అలప్పుజాలోని జాతీయ వైరాలజీ సంస్థకు పంపి పరీక్షించగా పలువురిలో పాజిటివ్ వచ్చింది.
కరోనాతో ఇప్పటికే అతలాకుతలం అయిన కేరళలో ఇప్పుడు మరో కొత్త వైరస్ కనిపించింది. వయినాడ్ జిల్లాలోని ఓ పశు వైద్యకళాశాలకు చెందిన 13 మంది విద్యార్థుల్లో నోరా వైరస్ బయటపడింది. రెండు వారాల్లోనే ఇది పదమూడు మందికి సోకినట్టు కేరళ ఆరోగ్యశాఖ వెల్లడించింది.
డయేరియా, వాంతులు ఈ వైరస్ లక్షణాలు అని చెప్పుకొచ్చిన ప్రభుత్వం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. కాలేజీ బయట హాస్టళ్లలోని విద్యార్థుల్లో తొలిసారి ఈ వైరస్‌ను గుర్తించారు. వారి రక్త నమూనాలను అలప్పుజలోని జాతీయ వైరాలజీ డిపార్ట్‌మెంట్‌కు పంపించారు. విషయం తెలుసుకున్న ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించి వ్యాధి వ్యాప్తిని అడ్డుకోడానికి కఠిన చర్యలు చేపట్టాలన్నారు.
కేరళ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి శుక్రవారం అధికారులతో సమావేశమై వయనాడ్‌లో పరిస్థితిని సమీక్షించారు. తాగునీటి వనరులను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు బాధితులకు తగిన చికిత్స అందించడం వంటి చర్యల ద్వారా వ్యాధి త్వరలోనే అదుపులోకి వస్తుందని అధికారులు తెలిపారు.
జంతువుల్లో పుట్టే ఈ వైరస్.. నీరు, ఆహారం ద్వారా వ్యాపిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కానీ, అందరూ అప్రమత్తంగా ఉండాలి. నీటిని ఎక్కువగా క్లోరినేషన్ చేయడం సహా నియంత్రణ చర్యలు కొనసాగుతున్నాయి.
తాగునీటి వనరులు పరిశుభ్రంగా ఉండేలా చూడాలి’ అని మంత్రి వీణా జార్జ్ అన్నారు. తగిన చికిత్స, నివారణ ద్వారా నోరో వైరస్ ను నియంత్రించవచ్చని, దీని గురించి ప్రతి ఒక్కళ్లూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. వైరస్ సోకినవారు తగినంత విశ్రాంతి తీసుకుని, ఓఆర్ ఎస్ ద్రావణం, కాచి చల్లార్చిన నీళ్లు తాగాలి. రెండు వారాల్లోనే 20 కుక్కలు మృతి చెందాయి. ఏ వ్యాధి సోకి శునకాలు మృతి చెందాయనే విషయాన్ని పశుసంవర్ధక శాఖ వైద్యులు ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నారు. కనైన్ డిస్టెంపర్ వైరస్ శునకాల మరణానికి కారణం కావచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు.