Begin typing your search above and press return to search.
వరల్ట్ అప్ డేట్: 1.45లక్షల మృతులు..22లక్షల కేసులు
By: Tupaki Desk | 17 April 2020 6:30 AM GMTవేసవి కాలం ఎండలు మండుతున్న కరోనా వేడి మాత్రం తగ్గడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి బారిన పడి మరణించిన వారి సంఖ్య తాజాగా 1.45 లక్షలు దాటేసింది. దాదాపు 22 లక్షల మంది వైరస్ బారిన పడ్డారు.అన్ని దేశాల్లోనూ కరోనాను కట్టడి చేయడానికి లక్ డౌన్ ను పొడిగించారు.ప్రపంచంలో గంటకు సగటున 107మంది ప్రాణాలు కోల్పుతున్నట్టు తేలింది.
అమెరికాలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో మరో 2569మంది వైరస్ కు బలయ్యారు. అమెరికాలో కరోనా మృతుల సంఖ్య 33వేలు దాటింది. వైరస్ బాధితుల సంఖ్య 6.77 లక్షలకు చేరింది.
యూరప్ లోని ఇటలీ - స్పెయిన్ - ఫ్రాన్స్ - బ్రిటన్ లు కరోనా దెబ్బకు విలవిల్లాడుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా మరణాల్లో అమెరికా తర్వాత ఇటలీ (22,170) - స్పెయిన్ (19,315) - ఫ్రాన్స్ (17,920) - బ్రిటన్ (13,720) స్థానంలో ఉన్నాయి. ఈ ఐదు దేశాల్లోనే మొత్తం 1.10 లక్షల మంది కరోనాకు బలయ్యారు. స్పెయిన్ లో గురువారం 551 మంది, ఇటలీలో 350 మరణాలు నమోదయ్యాయి.
పాకిస్థాన్ లో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమవుతోంది. దాయాది దేశంలో వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య 6,919కి పెరిగింది. ఇప్పటివరకు 128 మరణాలు నమోదయ్యాయి.
*భారత్ లో 13387కు చేరిన కరోనా కేసులు
ఇక భారత దేశంలోనూ కరోనా కేసులు తగ్గడం లేదు. శుక్రవారం మధ్యాహ్నం వరకు 13387 కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటివరకు కరోనా కారణంగా 437మంది మరణించారు. 1749మంది కరోనా నుంచి కోలుకున్నారు.
*తెలంగాణలో 650కి కేసులు సంఖ్య
తెలంగాణలో కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతూనే ఉంది. తాజాగా శుక్రవారం మధ్యాహ్నం వరకు కరోనా కేసుల సంఖ్య 650కి చేరింది. తెలంగాణలో కరోనాతో 18మంది చనిపోయారు. 118 మంది కోలుకొని బయట పడ్డారు.
*ఆంధ్రాలోనూ పెరుగుదలే
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య 525 కు చేరింది. 14 మంది ఇప్పటివరకు కరోనా కారణంగా చని పోయారు. 20 మంది కోలుకొని బయటపడ్డారు.