Begin typing your search above and press return to search.
ప్రపంచవ్యాప్తంగా 10లక్షలు - ఏపీలో 161కి కరోనా కేసులు
By: Tupaki Desk | 3 April 2020 7:10 AM GMTప్రపంచవ్యాప్తంగా కరోనా విశ్వరూపం కొనసాగుతోంది. రోజురోజుకు మహమ్మారి మరింత విస్తరిస్తోంది. వేల మంది ప్రజల ప్రాణాలను బలిగొంటోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య తాజాగా 1 మిలియన్ (10లక్షలు) దాటింది.
ఒక్క యూరప్ ఖండంలోనే 5 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలోని 200 దేశాలకు కరోనా వైరస్ అంటింది. సగం దేశాల్లో లాక్ డన్ కొనసాగుతోంది. 350 కోట్ల మంది ప్రజలు నిర్బంధంలో ఉన్నారు.
కరోనా వైరస్ ధాటికి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 187 దేశాల్లో 53వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 2 లక్షల మంది కోలుకున్నారు. 37వేల మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
కరోనా దెబ్బకు అమెరికా - ఇటలీ - స్పెయిన్ లు చిగురుటాకులా వణుకుతున్నాయి. ఇటలీ - స్పెయిన్ లలో 850మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటలీలో కరోనా వైరస్ మరణాల సంఖ్య 13వేలు దాటింది.గురువారం 800 మంది ప్రాణాలు కోల్పోయారు.
అమెరికాలో కరోనా మరణ మృదంగం వాయిస్తోంది. ప్రపంచంలోనే అత్యధికంగా 2.45 లక్షల కరోనా పాజిటివ్ కేసులు అక్కడ నమోదయ్యాయి. గురువారం ఒక్కరోజే దాదాపు 30వేల కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే అమెరికాలో ఏకంగా 1169మంది కరోనాకు బలి అయిపోయారు. ఒక్కరోజే 1000కి పైగా మరణాలు ప్రపంచంలో ఏ దేశంలోనూ నమోదు కాకపోవడంతో అమెరికాలో కరోనా తీవ్రతకు అద్దం పడుతోంది.అమెరికా వ్యాప్తంగా 27 రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు వేలల్లో నమోదవుతున్నాయి. ముఖ్యంగా న్యూయార్క్ - న్యూజెర్సీ - కాలిఫోర్నియా - మిచిగాన్ రాష్ట్రాల్లో అయిదంకెల కేసులు దాటేశాయి.
వైరస్ వెలుగుచూసిన చైనాలో పరిస్థితి తగ్గుముఖం పట్టింది. హెనాన్ ప్రావిన్స్ లో ఓ మహిళకు కరోనా సోకడంతో అక్కడ లాకడౌన్ విధించారు.
స్పెయిన్ - ఫ్రాన్స్ - బ్రిటన్ - జర్మనీ - నెదర్లాండ్ లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. స్సెయిన్ మరణాల్లో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది.
*భారత్ లో 2300+ దాటిన కరోనా కేసులు
మొన్నటి వరకు వందల్లోనే నమోదైన కేసులు.. ఇప్పుడు ఒక్కసారిగా ఢిల్లీ మర్కజ్ ప్రార్థనల తర్వాత దేశంలో వేలకు చేరుకున్నాయి. తాజాగా రాష్ట్రాల్లో ఇబ్బడి ముబ్బడిగా నమోదవుతున్న కేసులతో భారత్ లో మొత్తం కేసుల సంఖ్య 2300 దాటింది. రోజు టెస్టులు చేస్తుండడంతో ఇంకా సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
*ఏపీలో కరోనా కల్లోలం
ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. శుక్రవారం మధ్యాహ్నం ప్రభుత్వం విడుదల చేసిన బులెటెన్ తో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 161కి చేరింది. కొత్తగా నిన్న 12 కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో నెల్లూరులోనే 8 ఉన్నాయి. కొత్త కేసుల్లో ఎక్కువ శాతం నిజాముద్దీన్ ప్రార్థనలకు వెళ్లివచ్చిన వారే కావడం గమనార్హం. కరోనా కేసుల్లో తెలంగాణను ఏపీ దాటేయడం సంచలనంగా మారింది. ఏపీలో అస్సలు ఉనికే లేని కరోనా ఢిల్లీ ప్రార్థనలతో తర్వాత బాగా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీ వెళ్లివచ్చిన వారికే కరోనా ఎక్కువగా నిర్ధారణ అవుతోంది.
*కరీంనగర్ లో మరో 4 పాజిటివ్.. కలవరం
తెలంగాణలోని కరీంనగర్ లో మరో 4 పాజిటివ్ కేసులు బయటపడడం కలకలం రేపుతోంది. మర్కజ్ ప్రార్థనలకు వెళ్లివచ్చిన ముగ్గురు - ఇండోనేషియా బృందంతో సన్నిహితంగా మెలిగిన మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 140కి చేరువ అవుతున్నాయి.